/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. Miryala Kiran Kumar
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,32,281 క్యూసెక్కులు

ఔట్‌ఫ్లో 66,051 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ 210.03 టీఎంసీలు

కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి.

TG: తెలంగాణ సీజనల్‌ వ్యాధులపై డేటా విడుదల...

తెలంగాణ సీజనల్‌ వ్యాధులపై డేటా విడుదల. జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు 5,372 డెంగ్యూ కేసులు.

హై రిస్క్‌ డెంగ్యూ కేసులు హైదరాబాద్‌లో 1,852. సూర్యపేట 471, మేడ్చల్‌ 426, ఖమ్మం 375, నల్గొండలో 315 డెంగ్యూ కేసులు.

నిజమాబాద్‌ 286, రంగారెడ్డి 232, జగిత్యాల 185, సంగారెడ్డి 160, వరంగల్‌లో 110 డెంగ్యూ కేసులు. రాష్ట్రవ్యాప్తంగా చికెన్‌ గునియా కేసులు 152, మలేరియా 191 కేసులు.

హైదరాబాదులో దారుణం.. సెల్ ఫోన్ చార్జర్ కోసం మహిళను చంపిన యువకుడు..

హైదరాబాద్‌: దుండిగల్‌లో దారుణం

చార్జర్ కోసం మహిళను చంపిన యువకుడు

చార్జర్‌ ఇవ్వలేదని శాంత అనే మహిళను..

కొట్టి చంపిన కమల్‌ కుమార్‌

సీసీ కెమెరాలో రికార్డయిన హత్య దృశ్యాలు

భద్రాచలం: చర్ల:దశాబ్దాలు గడుస్తున్న తాలిపేరు ప్రాజెక్టు అదనపు 3 గేట్లు ఎందుకు ఓపెన్ చేయడం లేదు AITF మండల నాయకుడు గొంది ముయ్యన్న

దశాబ్దాలు గడుస్తున్న తాలిపేరు ప్రాజెక్టు అదనపు 3 గేట్లు ఎందుకు ఓపెన్ చేయడం లేదు AITF మండల నాయకుడు గొంది ముయ్యన్న

 చర్ల మండలం పెద్ద ముడిసిలేరులో ఉన్న ఎడమ పక్కన తాలిపేరు ప్రాజెక్టుకు అదనపు మూడు గేట్లకు 70 కోట్ల రూపాయలు సాంక్షన్ అయ్యాయి కానీ రెండు దశాబ్దాలు పూర్తవుతున్న ఇంకా దాన్ని పూర్తి చేయలేదని దీనిపైన పూర్తి అవగాహన సీనియర్ మీడియా మిత్రులకు నాయకులకు అధికారులకు ఉన్న స్పందించడం లేదని ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం మండల నాయకుడు గొంది ముయ్యన్న అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడానికి అధికారుల జేబులు నింపడానికి ఈ ప్రాజెక్టుకి ప్రతి ఏటా నిధులు వస్తున్నాయి.

పక్కన ఉన్న తాలు పేరు ప్రాజెక్టు ఎస్టిమేషన్ వెంగళరావు 24 గేట్లకు అంచనా 48 కోట్లు ఇప్పుడున్న అదనపు మూడు గేట్లకి 70 కోట్లు శాంక్షన్ అయ్యాయి దానికి దీనికి రూపాయలు డిఫరెంట్ కోట్లు పెట్టిన ప్రాజెక్టుకు 24 గేట్లు తక్కువ కోట్లకు పూర్తయింది  దీనిపైన అధికారులు పాలకులు 70 కోట్ల వరకు బిల్లు చేశారు అయినా ఎందుకు ఇది పూర్తి కావడం లేదు ఇట్టి విషయంపై అవగాహన ఉన్న మేధావులు రాజకీయ నాయకులు సీనియర్ పత్రికా రిపోర్టర్లు ఎందుకు స్పందించడం లేదు దీనిలో కుల సమీకరణ కూడా ఉందని ప్రజలలో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ప్రాజెక్టుకి కొండా సురేఖ భర్త అయినా కొండ మురళి హస్తం ఉన్నదని వారు అన్నారు ఇప్పటికైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు* స్పందించి ఈ తాలిపేరు ప్రాజెక్ట్ అదనపు మూడు గేట్లను పూర్తి చేయించి ప్రారంభోత్సవం చేయాలని ఇప్పుడున్న వరద బీభత్సవానికి కాల్ పేరు బిర్జి తట్టుకోవడం లేదని వారు సర్వే చేసి తెలియజేశారు రెండు దశాబ్దాలు అయిన పూర్తి కానిది కనీసం మూడో దశాబ్దానికైనా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆదివాసి మండలం అయినా చర్ల మండలం పైన పాలకులకు అధికారులకు ఎందుకు చిన్న చూపు అని ఆయన ప్రశ్నించారు.

కాలు పేరు అదనపు 3 గేట్లని పూర్తి చేయకపోతే ఆదివాసీ ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని పాలకులను అధికారులను వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు మండల నాయకుడు ఇర్ఫా రాజేష్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడు కామ్రేడ్ ముసలి సతీష్ పాల్గొన్నారు.

కోల్కతాలో మెడికోపై హత్యాచారం కేసులో లై డిటెక్టర్ టెస్టులో పొంతన లేని సమాధానాలు చెప్పిన సంజయ్రాయ్..

కోల్కతాలో మెడికోపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్..

లై డిటెక్టర్ టెస్టులో పొంతన లేని సమాధానాలు చెప్పిన సంజయ్రాయ్..

తాను చూసేసరికే లేడీ డాక్టర్ మరణించిందని చెప్పిన సంజయ్రాయ్..

సెమినార్ హాల్లోకి వెళ్లే సరికి మృతదేహం కనిపించిందన్న ప్రధాన నిందితుడు.. మృతదేహం కనిపంచడంతో భయంతో పారిపోయానన్న సంజయ్రాయ్.. అనేక ఆధారాలు చూపించి ప్రశ్నించిన సీబీఐ, సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్.. హత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నానన్న నిందితుడు..

న్యూఢిల్లీ: విద్యార్థుల కోసం పదివేల కోట్లతో విజ్ఞాన ధార పథకం..

10 వేల కోట్లతో విజ్ఞాన్‌ ధార

బయో ఈ3 పాలసీకి ఆమోదం

   

కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

న్యూఢిల్లీ,: విజ్ఞాన్‌ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ‘విజ్ఞాన్‌ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం కాలమైన 2021-22 నుంచి 2025-26 మధ్య రూ.10,579 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. ఈ పథకం కింద 11వ, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, యూజీ, పీజీ, పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టరల్‌ రిసెర్చ్‌ విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందించనుంది.*

అధునాతన పరిశోధనల కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం, సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులు, ఫెలోషిప్‌లు వంటివి ఈ పథకంలో ఉంటాయి. ఆర్థిక, పర్యావరణ, ఉపాధి కోసం జీవసాంకేతిక విజ్ఞానం(బయో ఈ3) విధానానికి సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వచ్ఛ ఇంధన, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ, పరిశోధన, ఈ రంగంలోని నూతన సాంకేతికత ప్రోత్సాహానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

TG: మాది రైతు ప్రభుత్వం:సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది.. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది.. మాది రైతు ప్రభుత్వం అని నిరూపించుకోవడానికి రూ.2లక్షల రుణమాఫీ చేశాం.. డ్రగ్స్, గంజాయి గురించి నిద్రలో ఆలోచించినా భయపడే పరిస్థితి కల్పిస్తాం.. డ్రగ్స్‌, గంజాయి మూలాలు ఏరివేస్తున్నాం. -సీఎం రేవంత్‌ రెడ్డి.

హైదరాబాద్‌ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్. పాతబస్తీలో బ్యాంకు నుంచి రూ.175 కోట్లు లావాదేవీలు...

హైదరాబాద్‌ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్. పాతబస్తీలో బ్యాంకు నుంచి రూ.175 కోట్లు లావాదేవీలు.

సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఇద్దరు ఆటో డ్రైవర్లు. జాతీయ బ్యాంక్‌లో 6 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్ల ద్వారా రూ. 175 కోట్ల లావాదేవీలు జరిపిన సైబర్ కేటుగాళ్లు.

హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌, ఇండోనేషియా, కంబోడియాలకు నిధులు బదిలీ. క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు ట్రాన్స్‌ఫర్ చేసిన ఆటో డ్రైవర్లు.

N-కన్వెన్షన్‌ గురించి వస్తున్న వార్తలపై అభిమానులు, శ్రేయోభిలాషులకు అక్కినేని నాగార్జున ట్వీట్‌..

అభిమానులు, శ్రేయోభిలాషులకు అక్కినేని నాగార్జున ట్వీట్‌. N-కన్వెన్షన్‌పై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ వినిపిస్తున్నాయి.

కన్వెన్షన్‌ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్‌ భూమి. ఒక్క సెంట్‌ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని 2014లో కోర్టు ఒక ఆర్డర్‌ ద్వారా జడ్జిమెంట్‌ ఇచ్చింది.

ప్రస్తుత నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తున్నాను. -నాగార్జున

నల్లగొండ: ఘనంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు.. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నేతలు..

ఘనంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

52వ జన్మదిన వేడుకల సందర్భంగా భూపాల్ రెడ్డి గారు తన స్వగ్రామమైన ఉరుమండ్లలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వి.టి.కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితుల కోలాహలం మరియు వేద పండితుల ఆశీర్వచనాల మధ్యలో భారీ కేక్ ను భూపాల్ రెడ్డి గారు కట్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ భూపాల్ రెడ్డికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

52వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు కంచర్ల భూపాల్ రెడ్డి గారిని భారీ గజమాలతో సత్కరించారు.

కంచర్ల భూపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు... అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమాలు మరియు గొల్లగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంచడమే కాకుండా అనాధలకు దుప్పట్లు కూడా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, నల్గొండ, కనగల్ మండల అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, ఐతగోని యాదయ్య, మహిళా నాయకులు శరణ్య రెడ్డి,కొప్పుల విమలమ్మ మరియు తదితర ప్రముఖ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.