సాగర్ లో నేటి నుంచి క్యాట్ -కో దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలి: కొడారి వెంకటేష్, వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (CATCO) పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆగస్టు 10, 11, తేదీల్లో నలగొండ జిల్లా నాగార్జునసాగర్ లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించే వర్క్ షాప్ ను విజయవంతం చేయాలని వినియోగదారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రాష్ట్రంలోని వివిధ వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, నూతనంగా వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేయాలనుకునే వారు హాజరగుతారని ఆయన అన్నారు. రెండు రోజులపాటు జరిగే వర్క్ షాప్ లో "నూతన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం -2019", ఆహార భద్రత చట్టం, తూనికల కొలతల శాఖలో వచ్చినటువంటి మార్పులు- చేర్పులు, ఐఎస్ఐ, బిఐఎస్ , హాల్ మార్క్, ఆగ్ మార్క్, సిల్క్ మార్క్, తదితర నాణ్యతా ప్రమాణాల చిహ్నాల గురించి, రేర (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్) , సంబంధిత శాఖల అధికారులు వివరిస్తారని ఆయన తెలిపారు. వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, వినియోగదారుల సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారని ఆయన అన్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే వారు, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు సెల్ నెంబర్ : 9440134610. 9059188199 లను సంప్రదించాలని ఆయన కోరారు.
Aug 09 2024, 21:45