పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలి: కల్లూరు ధర్మేంద్ర AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
యాదాద్రి భువనగిరి జిల్లా: పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. ఏ ఐ వై ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సమితి సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ అధ్యక్షతన భువనగిరి లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా *ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర* లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ని తాము స్వాగతిస్తున్నామని వారు అన్నారు. అయితే పోటీ పరీక్షల తేదీలు, ఫలితాలు,ఇంటర్వ్యూలు, నియామకాలు నిర్దిష్టమైన పద్ధతిలో వేగవంతంగా జరగాలని, అదే విధంగా ప్రభుత్వ శాఖలలో ఖాళీలను కూడా ప్రకటిస్తే బాగుంటుందని వారు డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని, విద్యాభ్యాసం పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు లేక తల్లిదండ్రులకు భారంగా మారారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన పాలకులు నిర్లక్ష్య ధోరణిని గత10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో చూశామని వారు గుర్తుచేశారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలబడాలని వారు అన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్ లను ఏర్పాటు చేయాలని, స్టడీ మెటీరియల్స్ ను ఉచితం గా అందించాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి, ఎస్ సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ యువతకు బ్యాంకుల నుండి సబ్సీడీ రుణాలను ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఎల్లంకి మహేష్, పేరబోయిన మహేందర్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్, ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి నయీమ్, కార్యవర్గ సభ్యులు సుద్దాల సాయికుమార్, కంబాల వెంకటేష్, పేరబోయిన మహేష్, జిల్లా సమితి సభ్యులు మోగిళ్ళ శేఖర్ రెడ్డి, నరేష్, మెట్టు లక్ష్మణ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
Aug 07 2024, 17:50