కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి,AIYF ఆధ్వర్యంలో వరదబాధితుల నిధి సేకరణ
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో ఇటీవల సంభవించిన వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో వందలాది ప్రజలు మృత్యువాత పడ్డారు, వేలాదిమంది నిరాశ్రయులు అయిన బాధితులకు అండగా నిలవాలని AIYF తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో భువనగిరి లో వరద బాధితుల నిధి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా *ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర,సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు* లు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రానికి చేయూతగా 5వేల కోట్లను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ ఆకస్మిక విపత్తులు సంభవించినా ప్రజలంతా ఐక్యమత్యంతో సహాయసహకారాలు అందిచాల్సిన బాధ్యత పౌరులపై ఉంటుందని వారు ఉద్ఘటించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలను వేగవంతం చేసుకోవడానికి పటిష్ట అధికార యంత్రాంగాన్ని తయారుచేయాలని వారు అన్నారు. అదేవిధంగా విపత్తులను ముందుగానే పసిగట్టడానికి మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఎల్లంకి మహేష్, పేరబోయిన మహేందర్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్, ఏ ఐ వై ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి నయీమ్, కార్యవర్గ సభ్యులు సుద్దాల సాయికుమార్, కంబాల వెంకటేష్, పేరబోయిన మహేష్, జిల్లా సమితి సభ్యులు మోగిళ్ళ శేఖర్ రెడ్డి, నరేష్, మెట్టు లక్ష్మణ్, ఎల్లంకి చంద్రశేఖర్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
Aug 06 2024, 17:29