డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి : AITUC రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో ఇండియన్ ఆటో డ్రైవర్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎండీ ఇమ్రాన్ ముఖ్యఅతిథిగా హాజరై ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ప్రతి నెల రూ.10 వేలు ఇచ్చేంత వరకు త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించినున్నట్లు అయన తెలిపారు. భువనగిరిలో ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని, కొత్త బస్టాండ్ లో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో, చాలా మంది డిగ్రీలు, ఉన్నత చదువులు చదివి ఉపాధి దొరకకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కోసం అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకు జీవనభృతి కింద నెలకు రూ.10,000/- ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆటో డ్రైవర్ల బతుకుల కోసం పోరాటం చేయవలసి వస్తుందని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గనబోయిన వెంకటేష్ (రాణా)సీనియర్ నాయకులు గొర్ల లక్ష్మణ్, ఎండీ షరీఫ్, ఇండియన్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు శానవాజ్, శకూర్, సల్మాన్, శ్రీను, చాంద్, అజయ్, జమీర్, సుల్తాన్, డానియేల్, స్వామి, ఆనంద్, షఫీ, పరమేష్, కృష్ణ, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.
Jul 12 2024, 20:34