అమరజీవి కామ్రేడ్ నోముల రాంరెడ్డి ఆశయాలను సాధిద్దాం: మాటూరి బాలరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
అమరజీవి కామ్రేడ్ నోముల రాంరెడ్డి గారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన ఆశయాలని సాధించినప్పుడే ఆయనకు మనమిచ్చే ఘననివాళని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు,సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు అన్నారు . శుక్రవారం వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామంలో నోముల రామి రెడ్డి 18 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోముల రామిరెడ్డి ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగిన సిపిఎం డివిజన్ నాయకులు కందాల రంగారెడ్డి సారధ్యంలో సంగెం గ్రామంలో ప్రభుత్వ బంచరాయి,పోరంబోకు భూములను భూమిలేని పేదలకు పంచాలని వివిధ కులాల వృత్తిదారులకు ఇవ్వాలని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ప్రభుత్వాల మెడలు వంచి వారందరికీ ప్రభుత్వ భూములు ఇప్పించారన్నారు* *కల్లుగీత కార్మికుల హక్కుల కోసం,దున్నేవాడికే భూమి అనే నినాదంతో పోరాటాలు నిర్వహించారని అన్నారు* *సంగం గ్రామం తో పాటు పరిసర గ్రామాలుగా ఉన్న వర్కట్ పల్లి, గోకారం,ధర్మారెడ్డిపళ్లి గ్రామాల్లో సిపిఎం పార్టీ విస్తరణ కోసం నిరంతరం కృషి చేశారని పేదల సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా నాయకత్వమంలో సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజా పోరాటాలు నిర్వహించారని అన్నారు* *భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం నిర్వహించారని వారి యొక్క స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు* *ఈ కార్యక్రమంలో రాంరెడ్డి సహచరులు సింగిల్ విండో చైర్మన్ సుర్కంటి వెంకట్ రెడ్డి సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ మాజీ సర్పంచ్ లు కీసరి రాంరెడ్డి కాసుల కృష్ణ,మాజీ ఎంపీటీసీ పబ్బతి మల్లేశం,సిపిఎం శాఖ కార్యదర్శి మండల కమిటీ సభ్యులు భీమనబోయిన జంగయ్య సీనియర్ నాయకులు ఏనుగు సాయి రెడ్డి, నోముల జంగారెడ్డి,అంగిడి దేవేందర్ రెడ్డి,సురకంటి లక్ష్మారెడ్డి,ఏనుగు ప్రభాకర్ రెడ్డి,బండి గారి శంకరయ్య,వరికుప్పల మల్లేశం,కీసరి రంగారెడ్డి,మెట్టు రవీందర్ రెడ్డి,చేగురి నర్సింహ,నారి రామస్వామి,మాడుగుల వెంకటేశం,జక్కుల వెంకటేశం, రామిరెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.వర్థంతి అనంతరం రాంరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి స్థూపం వద్ద మొక్కలు నాటడం జరిగింది.
Jul 12 2024, 16:49