/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన Vijay.S
న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రములో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి మజీద్, కార్యదర్శి రామదాసు లు మాట్లాడుతూ... న్యాయవాదులపై రోజురోజుకు జరుగుతున్న దాడులకు రక్షణగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, న్యాయవాదులకు రక్షణగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ: సుంకిశాల గ్రామంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో ఈర్లపల్లి భిక్షపతి  అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబాన్ని మాజీ సర్పంచ్ శ్రీమతి శ్రీ ఫైళ్ల సంధ్యా రాణి- ఉపేందర్ రెడ్డి గార్లు పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా  వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో , గూడూరు వెంకటరెడ్డి ,కొండే కిష్టయ్య, మంగ జగన్ (మాజీ సర్పంచ్ ) ,మంగ బాలయ్య, మంగ నర్సింహ, వేముల భిక్షపతి, ఎడవేల్లి బాలదరి, నర్సింహ,ఎల్లస్వామి,ఈర్లపల్లి స్వామి , తదితరులు పాల్గొన్నారు.
OU లో జర్నలిస్టులపై పోలీసుల దాడి అమానుషం: TJU జిల్లా అధ్యక్షులు ఎండి షానూర్

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ వాయిదా వెయ్యాలని నిరుద్యోగ యువకులు ఆందోళన చేస్తుంటే దానిని న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జీ తెలుగు న్యూస్ జర్నలిస్టు శ్రీచరణ్ ను పోలీసులు వ్యవహరించే తీరును దారుణమని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ అన్నారు . విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను తాము జర్నలిస్టులమని చెబుతున్నా పోలీసులు దురుసుగా వ్యవహరించి, వారిని బలవంతంగా లాక్కొని పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీసు స్టేషన్లో నిర్బంధించడం మీడియా భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులపై ఇలాంటి దౌర్జన్యాలు జరగకుండా అరికట్టేందుకు ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి చొరవచూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ ఖాజఫసివుద్దీన్ , జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టికొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన అంబేద్కర్ రెండో మనవడు యశ్వంత్ అంబేద్కర్, డాక్టర్ జేరిపోతుల పరుశురాం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాడు అంబేద్కర్ లేకుంటే నేడు ఆర్బిఐ లేదని కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో ముదిరించాలని జులై 29,30,31 తేదీలలో జంతర్ మంతర్ న్యూ ఢిల్లీ లో కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఆధ్వర్యంలో జరుగు మహా ధర్నా పోస్టర్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెండవ మనుమడు భీమ్ రావు యస్వంత్ అంబేద్కర్ చేతుల మీదుగా అంబేద్కర్ స్థాపించిన ప్రింటింగ్ ప్రెస్ ముంబయి లో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెండవ మనుమడు భీమ్ రావు యస్వంత్ అంబేద్కర్ మాట్లాడితూ ఈ న్యాయమేనా డిమాండ్ సాధన కోసం నా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని దేశంలో ఉన్న అంబేద్కర్ వాదులను ఏకం చేసి పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో మాట్లాడేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ 1921లో ఇంపిరియల్ బ్యాంకు కుప్ప కూలినప్పుడు "రూపాయి దాని సమస్య సమస్య పరిష్కార మార్గం' అనే పుస్తకాన్ని వ్రాసి హిల్టాన్ యాంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్, బ్రిటిష్ ప్రభుత్వానికిl ఇవ్వడం వల్ల ఇది వాస్తవం అని గ్రహించి 1931 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అంటే అంబేద్కర్ చేసిన కృషి ఎంతో ఉంది అని ఆయన ఫోటో కరెన్సీ నోట్లపై వేసినప్పుడే ఆయన చేసిన త్యాగానికి ఫలితం ఉంటుందని వెయ్యకుంటే చరిత్రను వక్రీకరించడమే అవుతుందని అయన ఆవేదన వ్యక్తం చేసారు జులై 29,30,31 తేదీలలో జంతర్ మంతర్ న్యూ ఢిల్లీ మహా మహా ధర్నాకు రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాజకీయ పార్టీల అధ్యక్షులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాము అన్నారు యొక్క కార్యక్రమంలో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ గట్టగల్ల సంజీవ మహారాష్ట్ర రాష్ట్ర బాద్యులు మూల్ నివాసి మాలజీ సంటి శంకర్ మహారాజ్, చాంద్ అహ్మద్ షేక్, డా శ్యాం దావన్ డా రోహన్ సరోల్ పిట్టల రాజు గట్టగల్ల బాబు చింత శ్రీను తదితరులు పాల్గొన్నారు .

భాష సంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ,నీలం థియేటర్ గోపరాజుపల్లి సంయుక్త ఆధ్వర్యంలో నీలం నాటకం పోస్టర్ ఆవిష్కరణ


భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, మరియు నీలం థియేటర్, గోపరాజుపల్లి, సంయుక్త ఆధ్వర్యంలో నీలం నాటకం పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ డా" మామిడి కృష్ణ సార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మిమిక్రీ శ్రీనివాస్ , సినీ నటుడు ప్రదీప్ (అంతేగా... అంతేగా ) అజయ్ మంకెనపల్లి అన్న, సింగపంగ ప్రభాకర్, అబ్దుల్ కలీం ఆజాద్, బిర్రు కిరణ్ కుమార్, జితేందర్, జరిగింది,మరియు నీలం నాటకం రచయిత మరియు దర్శకుడు,నీలం నరేష్ జూలై 15 మధ్యాహ్నం రెండు గంటలకు నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో, నాంపల్లి, లో నాటకం ప్రదర్శించడం జరుగుతుందని ఈ నాటకానికి ప్రతి ఒక్కరు వచ్చి చూసి ఆనందించాలని నీలం థియేటర్ ప్రెసిడెంట్ నరేష్ మాట్లాడడం జరిగింది.
నాతాళ్ళగూడెం గ్రామంలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాతాళ్లగూడెం గ్రామానికి చెందిన ఉద్దగిరి ఎల్లయ్య తండ్రి బాలయ్య వయసు 60, అనే రైతు తన తమ్ముడు సైదులు తో కలిసి తేదీ 8 -07- 2024 సోమవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పాముకాటు గురయ్యాడు .ఈ విషయాన్ని తన తమ్మునికి తెలుపగా తమ్ముడు ఇంటికి ,108 కి సమాచారం అందించాడు. 108 వాహనంలో చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 11:30 నిమిషాలకు మృతి చెందాడు .సోదరుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.
భువనగిరి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో దోమల నియంత్రణకు మున్సిపల్ అధికారుల ప్రత్యేక చర్యలు

భువనగిరి మున్సిపల్ 8 వ వార్డ్ రామ్ నగర్ సీత నగర్ జాంఖాన్నగూడెం నందగుట్ట పరిదిలో దోమల నియంత్రణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భువనగిరి పరిధిలో ఎలక్ట్రిక్ స్ప్రే మిషన్ల ద్వారా అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ అన్ని గృహలకు డోర్ టూ డోర్ దోమలు మందులు పిచికారి కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ….ఇంటి లోపల గోడలపై పిచికారీ చేసే దోమల మందు సింజెంట వారి ఐకాన్ (Syngenta – ICON) క్రిమి సంహారక మందు వల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగవని, ఈ మందు ద్వారా ఇంట్లోకి దోమలు రాకుండా నివారించ వచ్చని, మందు పిచికారి చేసిన ప్రదేశాలలో నీటితో కడగటం వంటివి చేయడం ద్వారా మందు ప్రభావం తగ్గుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత దోమల నివారణకు దోహదపడుతుందని అన్నారు. ప్రజలు గృహాలలో ఉన్న నీటి నిల్వలను అంటే పూల కుండీలు నీటి పాత్రలు, చెట్ల ఆకులు, కిటికీల సన్‌షేడ్‌లు, టైర్లు, ఇతర డంప్ చేయబడిన కంటైనర్లు & మెటీరియల్స్, స్తబ్దుగా ఉన్న డ్రైన్ పాయింట్లు, కూలర్లులలో నిల్వ ఉన్న నీళ్లు తీసివేయడంతో పాటు నిత్యం శుభ్రంగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్ రజిత, జవాన్ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

వెలువర్తి - అరూరు గ్రామాల మధ్యన గుంతలమైన బీటి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలి : సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెల్వర్తి గ్రామం నుండి అరూర్ వరకు గుంతలమైన నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు మంగళవారం రోజున సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా వెల్వర్తి గ్రామంలో సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ వెల్వర్తి గ్రామం నుండి అరూరు వరకు నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసే అనేకమంది ప్రయాణికులకు రైతులకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుందని అనేకమంది ఈ గుంతల్లో పడి గాయాల ఫాలఅవుతున్నారని వెంటనే రోడ్లు భవనాల శాఖ అధికారులు స్థానిక బోనగిరి ఎమ్మెల్యే స్పందించాలని కోరారు వెలువర్తి మొగిలి పాక గ్రామాలకు చెందిన అనేకమంది ప్రజలు అరూరు వేములకొండ గ్రామాల్లో బ్యాంకు పనుల నిమిత్తం మరియు ఇతర పనుల కోసం నిత్యం ప్రయాణం చేస్తుంటారని వారందరూ ఈ గుంతలమైన రోడ్డు వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో ఉన్న అధికారులు స్పందించకపోవడం వల్ల ఈ రోడ్డుకు ఈ పరిస్థితి వచ్చిందని వెంటనే ఇప్పటికైనా నూతన ప్రభుత్వం ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు అదేవిధంగా వెలువర్తి గ్రామం నుండి వలిగొండకు ప్రయాణం చేసే వలిగొండ వెల్వర్తి గ్రామాల మధ్యన వర్షాకాలం వచ్చిన సందర్భంలో ఇబ్బందులకు గురిచేసి కల్వర్టులను బ్రిడ్జిలుగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు గ్రామంలో ఇండ్లు లేని పేదలందరికీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లను మంజూరు చేయాలని వెల్వర్తి-కేర్చిపల్లి గ్రామాల మధ్యన ఉన్న బీటీ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం మండల కమిటీ సభ్యులు కల్కూరి ముత్యాలు,శాఖ కార్యదర్శి కల్కూరి వాసు,కూచుమల్ల కిష్టయ్య,గ్రామ రైతులు ఎడవెల్లి పాపయ్య, నరసింహ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు
సహృదయ వృద్ధాశ్రమంలో ఘనంగా రాములు గౌడ్ జన్మదిన వేడుకలు


యాదాద్రి భువనగిరి జిల్లా మంగళవారం బత్తిని రాములు గౌడ్ (స్వామి)గారి పుట్టినరోజు సందర్భంగా" వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమంలో నివసిస్తున్న 51 మంది అనాధ వృద్ధులకు మరియు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రాములు గౌడ్ గారి కుటుంబ సభ్యులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశ్రమంలోనీ వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బత్తిని వినోద, బత్తిని వాసవి శ్రీధర్ గౌడ్, భక్తులు ఆకుల శ్రీను, పెరుమెల్లి తిరుమలేష్, కోల వెంకటేష్ గౌడ్, పాక జహంగీర్, బత్తిని వెంకటేష్, ఉపేందర్, సంతోష్, వెలిమినేడు వెంకటేష్ , డీజే రవి కిరణ్ , సంస్థ వ్యవస్తాపకుడు బుషపాక శివకుమార్,ఆశ్రమ
నిర్వాహకులు సంతోష్ , లక్ష్మణ్ లుపాల్గొన్నారు.

పల్లెర్ల నుండి వేములకొండ స్టేజి వరకు బిటి రోడ్డు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలి: సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం

పల్లెర్ల నుండి వేములకొండ స్టేజ్ వరకు ధ్వంసమైన బీటీ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని , స్టేజి నుండి ఆత్మకూరు వరకు డబల్ రోడ్డు వేయాలని సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. జిల్లా కమిటీ పిలుపుమేరకు పోరుబాట కార్యక్రమంలో భాగంగా పల్లెల గ్రామంలో మంగళవారం పల్లెర్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో గుంతలు పడి ప్రజలకు ఇబ్బంది అవుతున్న రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని నూతన రోడ్డును వేయాలని నిరసన వివిధ గ్రామాలకు సంబంధించిన అనేకమంది ప్రయాణికులు కార్మికులు విద్యార్థులు వృత్తిదారులు రైతులు ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉన్నదని రోడ్డు మొత్తం ధ్వంసమై వెళ్లడానికి ఇబ్బందులు పడుతూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ అధికారులు పలుమార్లు రోడ్డు విషయంలో వారి దృష్టికి తీసుకుపోయిన గత నాలుగైదు సంవత్సరాలుగా పట్టించుకోవడంలేదని గత ఎమ్మెల్యే గారు కూడా రోడ్డు విషయంలో పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ రోడ్డు ప్రజలందరికీ వివిధ గ్రామాల ప్రజలకు ప్రధాన రోడ్డుగా మారిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించగలరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు మండల కమిటీ సభ్యులు రచ్చ గోవర్ధన్, గ్రామ కార్యదర్శి గుండబోయిన స్వామి, మండల కమిటీ సభ్యులు నాయని కృష్ణారెడ్డి, నాయినిరామ్ రెడ్డి, యాదిరెడ్డి, రోషి రెడ్డి, ఎరుకల చంద్రయ్య, లోడి గోపాల్, కానుకుంట్ల నరసింహ, సంఘపాక నరసింహం, గుండబోయిన మహేష్, వట్టిప్పల ఐలయ్య, మేడి బాబు తదితరులు పాల్గొన్నారు.