కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన అంబేద్కర్ రెండో మనవడు యశ్వంత్ అంబేద్కర్, డాక్టర్ జేరిపోతుల పరుశురాం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాడు అంబేద్కర్ లేకుంటే నేడు ఆర్బిఐ లేదని కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో ముదిరించాలని జులై 29,30,31 తేదీలలో జంతర్ మంతర్ న్యూ ఢిల్లీ లో కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఆధ్వర్యంలో జరుగు మహా ధర్నా పోస్టర్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెండవ మనుమడు భీమ్ రావు యస్వంత్ అంబేద్కర్ చేతుల మీదుగా అంబేద్కర్ స్థాపించిన ప్రింటింగ్ ప్రెస్ ముంబయి లో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెండవ మనుమడు భీమ్ రావు యస్వంత్ అంబేద్కర్ మాట్లాడితూ ఈ న్యాయమేనా డిమాండ్ సాధన కోసం నా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని దేశంలో ఉన్న అంబేద్కర్ వాదులను ఏకం చేసి పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో మాట్లాడేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ 1921లో ఇంపిరియల్ బ్యాంకు కుప్ప కూలినప్పుడు "రూపాయి దాని సమస్య సమస్య పరిష్కార మార్గం' అనే పుస్తకాన్ని వ్రాసి హిల్టాన్ యాంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్, బ్రిటిష్ ప్రభుత్వానికిl ఇవ్వడం వల్ల ఇది వాస్తవం అని గ్రహించి 1931 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అంటే అంబేద్కర్ చేసిన కృషి ఎంతో ఉంది అని ఆయన ఫోటో కరెన్సీ నోట్లపై వేసినప్పుడే ఆయన చేసిన త్యాగానికి ఫలితం ఉంటుందని వెయ్యకుంటే చరిత్రను వక్రీకరించడమే అవుతుందని అయన ఆవేదన వ్యక్తం చేసారు జులై 29,30,31 తేదీలలో జంతర్ మంతర్ న్యూ ఢిల్లీ మహా మహా ధర్నాకు రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాజకీయ పార్టీల అధ్యక్షులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాము అన్నారు యొక్క కార్యక్రమంలో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ గట్టగల్ల సంజీవ మహారాష్ట్ర రాష్ట్ర బాద్యులు మూల్ నివాసి మాలజీ సంటి శంకర్ మహారాజ్, చాంద్ అహ్మద్ షేక్, డా శ్యాం దావన్ డా రోహన్ సరోల్ పిట్టల రాజు గట్టగల్ల బాబు చింత శ్రీను తదితరులు పాల్గొన్నారు .
Jul 11 2024, 18:59