ఆలేరు: రైతు భరోసా సకాలంలో ఇవ్వాలి, తక్షణమే రుణమాఫీ చేయాలి : AIKMS జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజయ్య, కుమార్
ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే మాఫీ చేసి రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని *ఏ.ఐ. కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిరబోయిన రాజయ్య, బెజడి కుమార్* ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలేరు న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా రాజయ్య, కుమార్ లు మాట్లాడుతూ ప్రభుత్వ హామీలు మాటలకే పరిమితం అవుతున్నాయి కానీ ఆచరనలో అమలు కావడం లేదని వారు దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చే బీమా పథకం అమలు చేయడం లేదు, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా కానీ ఎరువులు,విత్తనాలు, అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.కల్తీ విత్తనాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆ విత్తనాలు అమ్మే వ్యాపారస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, మహారాష్ట్ర నుండి పాలు దిగుమతి చేస్కోవడం వల్ల రాష్ట్ర పాడి రైతులకు 1కేజీ పాలకు 12 నుండి 15 రూపాయలు ధర తగ్గడం జరిగింది, దీనిపై ప్రభుత్వం స్పందించి తక్షణమే పాడి రైతులను ఆదుకోవాలి, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని చేసి రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని, బోనస్ విధానం కేవలం సన్న వడ్లకే కాదూ, అన్ని రకాల వడ్లకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతాంగం పట్ల పెట్టి రైతులను ఆదుకోవాలని వారు అన్నారు.గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నప్పటికీ రైతు భరోసాను ప్రభుత్వం అందించకపోగా రైతులు వర్షాలు లేక, అప్పుల బాధతో కొట్టుమిట్టాడుతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తక్షణమే ప్రభుత్వం రైతు భరోసాని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.లేకుంటే రానున్న కాలంలో *ఏ.ఐ. కె.ఎం.ఎస్.* ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నపురెడ్డి రాఘవరెడ్డి, జిల్లా కోశాధికారి తమ్ముడి అంజయ్య,చిరబోయిన కొమురయ్య, గోపాల్ రెడ్డి, వంగాల నర్సింహారెడ్డి, కడకంచి బీరయ్య, పాల్గొన్నారు
Jul 09 2024, 18:15