కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి: KGKS యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు భువనగిరి లోని వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రాగిరి కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారికి, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర ప్రతినిధి బృందం ఇప్పటికే రెండుసార్లు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి పురోగతి లేదన్నారు. వృత్తిలో ప్రమాదం వలన వందలాదిమంది గీత కార్మికులు చెట్టు పై నుండి పడి చనిపోవడం, వికలాంగులు కావడం జరుగుతుంది. ఇప్పటికే 520 మంది ప్రమాదానికి గురయ్యారు వీరిలో 76 మంది చనిపోయారంటే ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. వీటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. టాడి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారి చొరవతో *సేఫ్టీ రోప్* 2022 లో యాదగిరిగుట్టలో రూపొందినప్పటికీ గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా జాప్యం చేస్తుంది. తక్షణమే ఇచ్చి గీత కార్మికులకు ప్రాణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షలు రూపాయలు ఎక్స్ గ్రేషియా నెలరోజుల లోపు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు.ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. మెడికల్ బోర్డు విధానం తొలగించలేదు. *ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు తక్షణమే వీటిపై స్పందించాలి*. టాడి కార్పొరేషన్ నుండి ఇచ్చే తక్షణ సహాయం తీవ్ర జాప్యం జరిగింది వాటిని వెంటనే అందివ్వాలి. బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన 22.20 కోట్ల రూపాయలతో నిర్మించిన నీరా కేఫ్ ని ఎలాంటి సంబంధం లేని టూరిజం డిపార్ట్మెంట్ నుంచి తొలగించి టాడి కార్పొరేషన్ కి అప్పగించాలి అన్నారు. *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు* మాట్లాడుతూ ప్రతి జిల్లాలో నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి యువతి యువకులకు ఉపాధి కల్పించాలి అన్నారు.చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి జీవో నెంబర్ 560 ప్రకారం 5 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఆగస్టు 18 లోపు నిర్మించాలి. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి.50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికుని కి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. *జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు మాట్లాడుతూ* నందనములో తాటి ఉత్పత్తుల పరిశ్రమ పనులు తక్షణమే పూర్తి చేసి గీత కార్మికులకు ఉపాధి కల్పించాలి అన్నారు. ప్రమాద నివారణకు ఇచ్చే సేఫ్టీ మోకులు యాదగిరిగుట్ట నుండి పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఆగస్టు రెండు నుండి 18 వరకు జిల్లాలో అమరుల యాదిలో కార్యక్రమం చేపడుతున్నామని దానిని జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు , గీతా కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర సలహాదారు మాటూరు బాలరాజు జిల్లా కమిటీ నాయకులు ధూపట్టి వెంకటేష్ బత్తిని బిక్షం అంతటి అశోక్ గాజుల ఆంజనేయులు మచ్చ నరసింహ పాండాల మైసయ్య మట్ట బాలరాజు. కుర్మిండ్ల ఈశ్వర్.బావల పెళ్లి బాలరాజు. పులి బిక్షము. చెరుకు బాలరాజు. కొండమడుగు శ్రీనివాస్.పరకాల అంజయ్య. బొడిగ బిక్షపతి. కోలా కృష్ణ. పల్సము స్వామి.బత్తిని సత్యనారాయణ. పాండవుల లక్ష్మణ్. పబ్బతి మల్లయ్య. కొక్కొండ లింగయ్య. శ్రీరామ్మూర్తి పూజారి కుమారస్వామి. ఎర్ర రవీందర్. కునూరు మల్లేశం. గడ్డమీద నిఖిల్. గడ్డమీద సోములు. రంగ కొండల్. తదితరులు పాల్గొన్నారు.
Jul 08 2024, 21:00