/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: గ్రామ సమస్యలపై ఫిర్యాదు అందజేసిన ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు Mane Praveen
NLG: గ్రామ సమస్యలపై ఫిర్యాదు అందజేసిన ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు
మర్రిగూడెం మండలం, ఖుదాభక్షి పల్లి గ్రామంలో  ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవైఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్ పలు గ్రామ సమస్యల పై డిప్యూటీ తహసిల్దార్ తారక రామన్ కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా బూడిద సురేష్ మాట్లాడుతూ.. రైతుల పొలాలలో ఉన్న ఇనుప స్తంభాలను తొలగించి వాటి స్థానంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఆక్రమణకు గురైన గ్రామకంఠం భూములను కాపాడాలని, గ్రామంలో బందరు దొడ్డి ఆక్రమణకు గురికాకుండా యధాస్థితిలో ఉంచాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ కార్యదర్శి పొట్టగిరి, సహాయ కార్యదర్శి మేతరి యాదయ్య, సీనియర్ నాయకులు ఇష్కిల్ల మహేందర్, సిరిపంగి శ్రీనివాస్ బొమ్మగాని హనుమంతు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
33/11 కెవి. విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరీ  పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ: పట్టణంలో బీట్ మార్కెట్ ఏరియాలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు.. రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ. 3 కోట్ల రూపాయల విలువ గల 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరీ చేయించి పనులకు శంకుస్థాపన చేశారు. గత వేసవిలో దాదాపు 14 నుంచి 15 వేల గృహాల ప్రజలు లోవోల్టేజీ సమస్య కారణంగా ఇబ్బందులు పడ్డారు.
NLG: డీసీసీబీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కుంభం శ్రీనివాసరెడ్డి ని అభినందించిన మంత్రి
నల్గొండ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంభం శ్రీనివాస్ రెడ్డి  డీసీసీబీ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. రైతులకు సేవ చేసేందుకు డీసీసీబీ ఒక మంచి అవకాశం, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకునికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీని చిరస్థాయిగా నిలబెడతామన్నారు.
NLG: నిర్మాణరంగ కార్మికుల పెండింగ్ క్లైమ్ లను వెంటనే పరిష్కరించాలి: సిఐటియు జిల్లా అధ్యక్షుడు
నల్లగొండ జిల్లా వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల మండల జనరల్ బాడీ సమావేశం బి. లక్ష్మయ్య అధ్యక్షతన సిఐటియు కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో నిర్మాణరంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందించడంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని లేబర్ అధికారులు ప్రదర్శిస్తున్నారని వెంటనే క్లైములు పరిష్కారం చేయకపోతే డీసీఎల్ ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.           
వెల్ఫేర్ బోర్డులో 3 వేల కోట్ల రూపాయలు మూలుగుతున్న కార్మికులకు క్లెయిమ్స్ చెల్లించడంలో లేబర్ అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తూ కార్మికుల చెప్పులు అరిగేలాగా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఇస్తున్న నష్టపరిహారాలు కూడా పెంచాలని డిమాండ్ చేశారు. నిర్మాణ కార్మికుల యాప్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించి మళ్లీ పనిలోకి తేవాలని కోరారు.సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులందరూ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేరి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అనుభవించాలని కోరారు. ప్రభుత్వాలు నిర్మాణరంగా కార్మికుల పట్ల సవితి తల్లి ప్రేమ ప్రదర్శిస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ మండల నాయకులు బి. లక్ష్మయ్య, నీలకంఠం రాములు, పిడిగం  వెంకటయ్య, పగడాల పెద్దఅంజయ్య, ఊరి పక్క యాదయ్య, పగిళ్ల రాములు, గ్యార నరేష్,  సీత పర్వతాలు పగడాల అశోక్ లప్పంగి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
పిఏసిఎస్ చైర్మన్ పందుల యాదయ్య గౌడ్ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ సమావేశం
మర్రిగూడ మండల కేంద్రంలో పిఏసిఎస్ చైర్మన్ పందుల యాదయ్య గౌడ్ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతు బంధు పథకం పైన రైతుల సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీఏ ఎల్లయ్య హాజరైనారు. ఈ సందర్భంగా రైతుల సలహాలు-సూచనల నివేదికను ప్రభుత్వానికి పంపుటకు మినిట్స్ రిపోర్ట్ ను సహకార అధికారులు సేకరించారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు మహేశ్వరం మారెమ్మ, పగడాల లింగయ్య, మొగుదల ముత్యాలు, మండారీ అచయ్య, ఆంబోతు బొడ్య, బాయికడి ఏడు కొండలు, మామిడి యాదయ్య, ఉప్పునూతల మల్లయ్య, గుంటోజు రామా చారి, చామకూర తేజశ్రీ, సహకార అధికారులు అసిస్టెంట్ రిజిష్టర్ రామనర్సయ్య, వ్యవసాయ అధికారులు ఏఓ హేమలత, ఏఈఓ లు విజయ్ కుమార్, పావని, శ్రీలత, సుజాత, సంఘ సీఈఓ రావిరాల శ్రీనివాస్, సంఘ సిబ్బంది కోట మల్లికార్జున్, రావిరాల శివ సాయి, కట్కూరి సందీప్, మదగోని పరమేష్, మరియు సంఘ సభ్యులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
నేటి నుండి కొత్త చట్టాలు
న్యూఢిల్లీ : దేశంలో జులై 1 నుండి మూడు కొత్త న్యాయ చట్టాలు అమలులోకి రానున్నాయి. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్,(ఐపీసీ) స్థానంలో
భారతీయ న్యాయసంహిత బీఎన్‌ఎస్, క్రిమినల్ ప్రొసీ జర్ కోడ్ (సీఆర్‌పిసి) స్థానంలో
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బీఎన్‌ఎస్‌ఎస్,
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ ) స్థానంలో భారతీయ సాక్ష అధినియం బీఎస్‌ఏ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే వీటిపై ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతుండగా, మరోవైపు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే అనేక దశలుగా పోలీస్‌లకు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. కంప్యూటర్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు, న్యాయవిచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. *కొత్త చట్టాల ప్రకారం*
1. బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూని కేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయవచ్చు. దీంతో వేగవంతంగా చర్యలు తీసుకొనే వెసులుబా టు పోలీస్‌లకు లభి స్తుంది.
2. జీరో ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్‌స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. 14 రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసును కొలిక్కి తేవాలి. 3. అరెస్ట్ సందర్భాలలో బాధితుడు సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందడానికి వీలవుతుంది.
4. అరెస్ట్‌ల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌ తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్ట్‌కు సంబంధించిన ముఖ్య మైన సమాచారాన్ని బాధితుల కుటుంబీకులు, స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది.

5. హేయమైన నేరాల్లో ఇకనుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి. ఏడేళ్లకు పైగా శిక్షపడే అవకాశం ఉన్న నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీని వల్ల దర్యాప్తులో నాణ్యత, విశ్వస నీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
6. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి కావాలి. అంతేకాదు బాధిత మహిళలు, చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స , వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి.
TG: కాంగ్రెస్ పార్టీలో చేరిన మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షుడు చింతపల్లి బాలకృష్ణ
ఈరోజు ఖమ్మం పట్టణంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో నల్గొండ మండలం రసూల్ పూర్ గ్రామానికి చెందిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చింతపల్లి బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. గతం లో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో పనిచేసి, తర్వాత బిఆర్ఎస్ లో పార్టీ లో చేరి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి చేరుకున్నారు. సొంత గూటికి చేరిన సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు  జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ , రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి జాకో ప్రతాప్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొర్లపాటి చిరంజీవి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు కామళ్ళ సంపత్, కాంగ్రెస్ నాయకులు తీగల నవీన్, సోయల్, మాల మహానాడు చింతకాని మండల గౌరవ అధ్యక్షలు పట్టేటి గోపయ్య సీనియర్ మాలమాల నాయకులు మాలమహానాడు చింతకాని మండల అధ్యక్షులు గామాల రవికుమార్,వనం చిన్నప్ప, మాల మహానాడు సీనియర్ నాయకులు గొర్రె ముచ్చు రత్నాకర్ మండల ఉపాధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
NLG: ఉద్యోగ పదవీ విరమణ పొందుతున్న ప్రధానోపాధ్యాయునికి ఘన సన్మానం
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు
మేడిపల్లి లింగయ్య 40 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించి, ఈరోజు ఉద్యోగ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు వారికి ఘన సన్మానాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో కోలాట నృత్యాలతో సన్మాన గ్రహీత దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రీయ నృత్యాలతో కార్యక్రమాన్ని ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు.
శివన్నగూడ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇవాళ మర్రిగూడ మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. శివన్నగూడ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పరిధిలో ముంపు గ్రామాలలో ఇల్లు కోల్పోయిన వారికి సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి త్వరితగతిన ఇండ్ల స్థలాలను కేటాయించనున్నట్లు, ఇంకా ఎవరికైనా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపోతే అందజేయనున్నట్లు తెలిపారు. మర్రిగూడ మండలంలో లేదా చింతపల్లి సమీపంలో ఇండ్ల స్థలాలను కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మండల సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షుడు పాక నగేష్ యాదవ్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

వైద్య రత్న జాతీయ అవార్డు అందుకున్న డాక్టర్ పాల్వాయి వెంకట్ రెడ్డి
NLG: పీఏ పల్లి మండలంలోని గ్రామాలలో నిరుపేదలకు సూర్య హాస్పిటల్ సిబ్బంది ద్వారా ఉచిత మందులు, రక్త పరీక్షలు ఈసీజీ ద్వారా ప్రజలకు ఉచితంగవైద్య సేవలందించి పేద ప్రజల ఆప్తుడైన డాక్టర్ పాల్వాయి వెంకట్ రెడ్డి కి హైదరాబాద్  సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య భవన్లో బహుజన సాహిత్య అకాడమీ 4వ బహుజన రైటర్స్ వెస్టర్ను ఇండియా కాన్ఫరెన్స్ అవార్డుల ప్రధానోత్సవ సదస్సు లో సంస్థ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా వైద్య రత్న జాతీయ అవార్డులను నిన్న అందజేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ తెలంగాణ ఉద్యమకారులు కవి గాయకులు దరువు ఎల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ.. బహుజన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ఒక స్టేట్లో ఇండియా కాన్ఫరెన్స్ అవార్డుల ప్రధానోత్సవ సదస్సులు నిర్వహించి ప్రజాసేవ చేసినటువంటి డెలిగేట్స్ ను మా సంస్థ  గౌరవించి వారిని వారు చేసిన సేవను బట్టి అవార్డులను అందజేస్తామన్నారు. బహు జన సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం సంఘ సేవకులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు మరియు స్వచ్ఛందంగా ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలియజేశారు. తెలంగాణలోని 33 జిల్లాల నుండి 200 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కు హాజరై అవార్డులు తీసుకున్నట్లు తెలియజేశారు. అవార్డు అందుకున్న డాక్టర్ పాల్వాయి వెంక రెడ్డి మాట్లాడుతూ..  జాతీయ స్థాయిలో నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరమని అలాగే ఇంకా గ్రామాలలో ఉచిత వైద్యం అందించడానికి నాకు ఇంకా బాధ్యత పెరిగిందని పేదలకు ఎల్లవేళలా వైద్య సేవలందిస్తానని వారు తెలియజేశారు. నాకు వైద్య రత్న జాతీయ అవార్డుకు సెలక్షన్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర కమిటీ మెంబర్ సామాజిక వేత్త, దళిత రత్న బుర్రి వెంకన్న కు కృతజ్ఞతలు అని తెలిపారు.