Telangana: ఆ నలుగురికే మంత్రి పదవులు..!
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా కేబినెట్ విస్తరణ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు.
ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేదానిపై పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చర్చలు జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నలుగు పేర్లతో జాబితాను అధిష్ఠానానికి అందించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండు పేర్లతో మరో జాబితాను అందించారు.
దీంతో ఆరు పేర్లలో నలుగురిని ఫైనల్ చేయాలని రాష్ట్ర నేతలకు అధిష్ఠానం స్పష్టం చేసింది. దీంతో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేదాని చర్చలు కొనసాగుతోన్నాయి. రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
ప్రస్తుతానికి నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, లంబాడీల నుంచి నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన ముదిరాజ్ కు చెందిన వాకిటి శ్రీహరి, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Jun 27 2024, 13:00