హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్..!
హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారిన హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతికి వెళ్లాలంటే కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నా అమలులో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పుడు వివాదాలన్నీ పరిష్కరించిన కేంద్రం.. రోడ్డు విస్తరణ పనులకు పచ్చజెండా ఊపింది
హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకూ ఉన్న 181.50 కిలోమీటర్ల రహదారిని 2010లో ఆరు లైన్లుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) జీఎమ్మార్ సంస్థకు బాధ్యతలు అప్పజెప్పింది. కానీ 181.50 కిలోమీటర్ల రోడ్డును రూ.
1740 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చిన జీఎమ్మార్ 2012 నుంచి పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూలు చేసుకుంటోంది. ఇలా 2025 జూన్ వరకూ వసూలు చేసుకునేందుకు జీఎమ్మార్ కు గడువు ఉంది. కానీ మధ్యలో దీన్ని ఆరులైన్లుగా మార్చే ప్రతిపాదన వచ్చింది.
Jun 27 2024, 11:24