అంగన్వాడీల వేతనాలు పెంచాలి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలి
AITUC కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్
అంగన్వాడీల వేతనాలు 18 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తక్షణమే వేతనాలు పెంచాలని ఇతర హామీలు అమలు చేయాలని
ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. AITUC ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడిల సమస్యలను పరిష్కరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజుల సమ్మె చేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదని,కాంగ్రెస్ పార్టీ అంగన్వాడి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే 18 వేల వేతనం చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్ కు 5 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు లక్ష రూపాయలు ఆయాకు 50 వేలు మాత్రమే చెల్లిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని అన్నారు. అంగన్వాడి లపై పనిబారం తగ్గించాలని ,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని , ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేసారు. గ్రామస్థాయిలో అన్ని రకాల పనులు అంగన్వాడీల చేత చేయిస్తూ అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. అంగన్వాడి సెంటర్ కు గుడ్లు నాణ్యత లేకుండా వస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించాలని కోరారు. గత ప్రభుత్వం జారీ చేసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించిన జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని కోరారు. గతంలో సమ్మె కాలపు 24 రోజుల వేతనం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వెబ్సైట్లో అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారని దీనివలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అందడం లేదని అన్నారు.
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు గా ఆయాలుగా పనిచేస్తున్న నేటికీ గౌరవ వేతనం పొందుతూ వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటి అద్దెలు కూరగాయల బిల్లులు గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ,జిల్లా ఉపాధ్యక్షురాలు శాంత కుమారి, కోట్ల శోభ, శంతాబాయి,సాయి సుజిత ,బి రాణి, అన్నపూర్ణ,ప్రభావతి, అంజలి,రమణ,వణజా, విజయ,టీ సరిత,దస్లి,జగదేశ్వరీ, పద్మావతి, సునీత, కేదారి,స్వప్న బక్కమ్మ,ch తారక, జయంతి జంగమ్మ, జ్యోతి, ప్రమీల, అరుణ విజయలక్ష్మి, భద్రమ్మ, రెడ్డి బాయ్,AITUC డివిజన్ కార్యదర్శి విశ్వనాధులు లెనిన్, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో సమర్పించడం జరిగింది.
Jun 26 2024, 10:49