తెలుగుదేశం ప్రభుత్వం లోనూ పనులు చేయించుకునేలా చెవిరెడ్డి భారీ స్కెచ్
అసెంబ్లీ లో క్యాటరింగ్ ద్వారా తన అనుచరులకు 5కోట్లు పాత బకాయిలు చెల్లించేలా దిమ్మతిరిగే ప్లాన్
ఎమ్మెల్యే గా ఓత్ తీసుకుని అసెంబ్లీ నుంచి వెళ్లిపోతున్న జగన్ తో ఫుడ్ కాంట్రాక్టర్ తిలక్ జరిపిన ఏకాంత భేటీ అనేక అనుమానాలకు తావిస్తోంది.
అసెంబ్లీ కి వచ్చి తన పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సరిగా మాట్లాడని జగన్ ... ఫుడ్ కాంట్రాక్టర్ తిలక్ తో మాత్రం 5మినిట్స్ పైనే మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. అంతా మనం అనుకున్నట్లే జరుగుతోంది మళ్లీ వస్తే నన్ను మర్చిపోవద్దoటూ తిలక్ జగన్ తో దేనిని ఉద్దేశించి అన్నాడో ఆలస్యంగా అందరికి అర్ధమవుతోంది.
టిడిపి సానుభూతి పరుడు ముసుగులో వైసిపి తొ అంతకాగుతూ . అసెంబ్లీ లొ బోజనాల్ని పెట్టె కాంట్రాక్టర్ తిలక్ కు తెలివిగా చెవిరెడ్డి అప్పగించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో తిలక్ చేపట్టిన భోజన కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారాక మళ్లీ తిలకే భోజనం కాంట్రాక్టు తెచ్చుకుంటాడని ముందే పసిగట్టిన వైసీపీ పెద్దలు అతణ్ని ముందే లొంగతీసుకున్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రధాస అనుచరుడైన ,తాడేపల్లి కృష్ణ రెడ్డి ద్వారా అతని అనుచరుడు మల్లికార్జునరెడ్డి ద్వార అసెంబ్లీ భోజనాల కాంట్రాక్టు తిలక్ ద్వారా నడిపే పన్నాగం పన్నారు.
ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తిలక్ ద్వారా తమకు రావాల్సిన 5కోట్ల బకాయిలు రాబట్టుకోవటంతో పాటు తాము పంపే భోజనమే అసెంబ్లీలో సభ్యులు ఇతర సిబ్బంది కి అందేలా పకడ్బందీగా స్కెచ్ వేశారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రధాస అనుచరుడైన ,తాడేపల్లి కృష్ణ రెడ్డి తయారు చేసే భోజనం ఇప్పుడు మల్లికార్జునరెడ్డి ద్వారా తిలక్ కు చేరితే అతను అసెంబ్లీలో కాంట్రాక్టర్ గా ఫుడ్ సప్లై చేస్తాడు. తిలక్ చేసేదల్లా మినిస్టర్ లు ఎమ్మెల్యేలు వద్ద అతివినియం ప్రదర్శిస్తూ ఎక్కడా తన వెనుక ఉన్న వైసీపీ గ్యాంగ్ పై అనుమానం రాకుండా చేయటమే. ఇందుకు ఫుడ్ సప్లైయర్లు, సూపరువైజర్ల ముసుగులో వైసీపీ మనుషుల్ని పెద్దయెత్తునే అసెంబ్లీకి మోహరించేసుకున్నాడు. ఎమ్మెల్యేలని సైతం గుర్తుపట్టకుండా వారిని ఇన్సల్ట్ చేస్తూ మంత్రులు కనిపిస్తే చాలు ఎమ్మెల్యే చేతిలో ఉన్న ఖాళీ ప్లేటు సైతం లాగేసుకుని మంత్రికి ఇచ్చి 2రోజులు అతివినియం బాగా చూపాడు.
ఇష్టానుసారం బిల్లులు ఆమోదం చేపించుకునెందుకు మల్లిఖార్జున రెడ్డి ద్వారా క్రిష్ణరెడ్డి వ్యాపార సంస్థకు చేరేలా పక్కా స్కెచ్ అమలు చేస్తున్నాడు.
టీడీపీ కి నిత్యం ఫుడ్ సప్లై చేసే కాంట్రాక్టర్లను కాదని ఈ తిలక్ ని ఎవరు తీసుకొచ్చారనే చర్చా టీడీపీ నేతల్లో జరుగుతోంది. టీడీపీ వాళ్లైతే నాకేంటి అసెంబ్లీలో నాదే ఇష్టారాజ్యం అంటూ అందరినీ అగౌరవ పరిచే వీడి వెనుక ఎవరు ఉన్నారని సీనియర్లు సైతం ఆశ్చర్య పోతున్నారట. బిల్లులు మాట అటుంచితే చెవిరెడ్డి వైసీపీ నేతలతో ఆంటకాగే Tilak ద్వారా ఎమ్ కుట్ర జరుగుతోందనే అనుమానం నెలకొంది ‼️
Jun 23 2024, 12:54