కుల జనగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. బీసీ సంఘాలతో కూడిన రౌండ్ టేబుల్ సమావేశంలో బి.ఎల్.ఎఫ్. నాయకుల ఉధ్గాటన
దేశంలో, రాష్ట్రంలో గత పాలక ప్రభుత్వాలన్నీ జగనాభాలో సగభాగానికంటే ఎక్కువగా ఉన్న బీసీ ప్రజలను మోసం చేస్తున్నారని, నేటికీ బీసీ ప్రజలకు పార్లమెంట్లో, అసెంబ్లీలో రిజర్వేషన్లు లేకపోవడం స్థానిక సంస్థల్లో కూడా బీసీ ప్రజలకు బిచ్చం వేసినట్టుగా పాలకపక్షాలు అతి తక్కువ రిజర్వేషన్లు ఇవ్వడం అత్యంత దుర్మార్గం. ఈ స్థితి ఉండడానికి వీలులేదని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం కూడా అశాస్త్రీయమైనది. 42 శాతం కంటే ఎక్కువగా గణనీయమైన సంఖ్యలో బీసీ ప్రజలు ఉంటారని తక్షణం కుల జనగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, యధాతధ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ గత వివక్ష కొనసాగుతుందని, దీనిని సహించబోమని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులజనగణన చేపట్టే వరకు, బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెంచే వరకు ప్రత్యక్ష పోరాటం సాగిస్తామని" బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర నాయకులైన బీ.సీ.పీ. రాష్ట్ర కార్యదర్శి కే. పర్వతాలు, బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర నాయకులైన ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి, బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర నాయకు లైన ఎం.సి.పి.ఐ.(యు) కేంద్ర కమిటీ సభ్యులు వస్కుల మట్టయ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.
ఈరోజు నల్లగొండలో జరిగిన బీ.సీ. సంఘాల, బి.ఎల్.ఎఫ్. భాగస్వామ్య రాజకీయ పక్షాల సమన్వయ రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. నల్లగొండలోని పెన్షనర్స్ బిల్డింగ్ లోని మీటింగ్ హాల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో 40 బీసీ సంఘాలకు చెందిన 50 మంది నాయకులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం మూకుమ్మడిగా వెళ్లి నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ గారికి కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కుల జనగణన చేపట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీ.సీ. ప్రజలు మోసపోతారని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం 23 శాతం అమలు చేస్తామని, చెప్పి కేవలం 18 శాతం మాత్రమే అమలు చేశారని ఈ విషయంలో ఏనాడు ఎవరు ప్రశ్నించలేదని ప్రస్తుతం కూడా ఇదే స్థితి కొనసాగితే, తీవ్రంగా పోరాడుతామని మాట్లాడిన నాయకులు ప్రతినిధులందరూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి బీ.సీ.పీ. రాష్ట్ర కార్యదర్శి కే పర్వతాలు అధ్యక్షత వహించారు. ఆహుతులు అందరికీ బి.ఎల్.ఎఫ్. తరఫున చర్చకు సాధ్యమయ్యే అంశాలతో రిపోర్టును ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ప్రవేశపెట్టి మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన విషయాలను ప్రతిపాదించారు. వీటిపైన ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్, రిటైర్డ్ తహసిల్దార్ ప్రకాష్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్, గంగపుత్ర జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్న, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్, యాదవ సంఘం జిల్లా నాయకులు వేణు కుమార్ యాదవ్, మేర సంఘం జిల్లా నాయకులు తాడూరి రమేష్ మేర, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు నేలపట్ల రమేష్ నాయి, శాలివాహన సంఘం నాయకులు వెంకన్న ప్రజాపతి, నిమ్మనగోటి కృష్ణయ్య ప్రజాపతి, విశ్వకర్మ జిల్లా నాయకులు ప్రకాష్ చారి, వడ్డెర సంఘం జిల్లా నాయకులు రమేష్, గౌడ సంఘం జిల్లా నాయకులు వడ్డగోని అంజయ్య గౌడ్, రజక సంఘం జిల్లా నాయకులు కొండూరు సత్యనారాయణ, బహుజన ఉద్యమ నాయకులు వంటేపాక యాదగిరి, బీసీ సంఘం నల్లగొండ పట్టణ అధ్యక్షులు సదాశివ, మేళ్ల శంకర్ ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్, మేడిద పురుషోత్తం ధర్మరాజు, సింగం వెంకటయ్య, సింగారం మల్లయ్య, శేఖర్ శాలివాహన సంఘం జిల్లా నాయకులు శరత్ బాబు, పి ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు బైరు వెంకన్న గౌడ్, గునగంటి సత్తయ్య గౌడ్, సుంకర బోయిన మల్లయ్య, సుంకరి నరసింహ, కప్పల రాకేష్ గౌడ్, ఎంసిపిఐ యు జిల్లా నాయకులు పోతుగంటి కాశి, వస్కుల భరత్, సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా నాయకులు జక్కుల నరసింహ, బైరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
చివరిలో సమావేశానికి సకాలంలో విచ్చేసి విలువైన సూచనలు సలహాలు ఇచ్చి భవిష్యత్తులో వేలాదిమంది బీసీ ప్రజలచే నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించాలని, కుల జన గణనలతో సంబంధం లేకుండా అతి తక్కువ రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఎలక్షన్ కమిషనర్ ఆఫీసును కూడా ముట్టడించడానికి బీసీ ప్రజలు సిద్ధం కావాలని ఎం సి పి ఐ యు కేంద్ర కమిటీ సభ్యులు వస్కుల మట్టయ్య చెబుతూ విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
Jun 16 2024, 15:10