మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం.
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు..
ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా 1,437 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కోసం మొత్తం ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు.
నాలుగు టేబుళ్లపై 300 ఓట్లు, మరో టేబుల్‌పై 237 ఓట్ల చొప్పున లెక్కిస్తారు.
ఈ ఎన్నికల్లో మన్నె జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), నవీన్‌కుమార్‌రెడ్డి (భారాస), సుదర్శన్‌గౌడ్ (స్వతంత్ర) పోటీ చేశారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. మార్చి 28న పోలింగ్ నిర్వహించగా.. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు సాగుతుండడంతో ఉప ఎన్నిక కౌంటింగ్‌ను ఇప్పటివరకు పెండింగులో ఉంచారు.
Jun 02 2024, 18:16