పెద్దపల్లి జిల్లాల్లో విస్త్రృతంగా పోలీసుల తనిఖీలు
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీ సులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
తాజాగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలొ ఎన్నికల లొ ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు నగదు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను అరిక ట్టేందుకు ముత్తారం ఎస్ఐ మధుసూదన్ రావు ఆధ్వ ర్యంలో పోలీసులు గురు వారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు.
మండలంలోని మచ్చుపేట గ్రామ ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలను ఆపి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎస్ఐ మధుసూదన్ రావు మాట్లాడుతూ..
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరూ కూడా రూ.50వేల రూపాయల నగదును మించి తీసుకెళ్ల రాదని, ఒకవేళ తీసుకెళ్తూ పోలీసుల తనిఖీల్లో పట్టు బడితే ఎన్నికల అధికారు లకు అప్పగించడం జరుగుతుందని సరైన ఆధారాలు చూపిస్తే ఆ నగదును తిరిగి అప్పగి స్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Apr 26 2024, 12:10