చేనేత బకాయిల విడుదల హర్షనీయం -బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్
![]()
చేనేత బకాయిల విడుదల హర్షనీయం
-బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్
చేనేత కార్మికుల బకాయిలకు సంబంధించి మొదట విడుతగా 50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడాన్ని బీసీ రాజ్యాధికార సమితి స్వాగతించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మేరకు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్ యూనిఫామ్‌ల తయారీకి 47 కోట్ల అడ్వాన్సుతో పాటు నూలు కొనుగోలు, సైజింగ్ కు మరో 14 కోట్లు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరకు సంబంధించి మొత్తం 351 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మిగతా బకాయిలను కూడా త్వరలో విడుదల చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని దాసు సురేష్ కోరారు. సిరిసిల్ల చేనేత పరిశ్రమ స్వయం అభివృద్ది చెందకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకే పరిమితం చేసిందని విమర్శించారు. ఇపుడు కేటీఆర్ మొసలికన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల చేనేత పరిశ్రమ పూర్వ వైభవం సాధించేలా ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని కోరారు.


జ్యోతిబాపూలే 150 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి-దాసు సురేశ్ , అధ్యక్షులు - బీసీ రాజ్యాధికార సమితి
నల్గొండ జిల్లా మునుగోడు రోడ్డు ఈద్గా నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మంచినీరు పంపిణీ చేయడం జరిగింది.ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది హిందూ ముస్లిం అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో కలిసి ఉండాలని ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు VHP జిల్లా గౌరవ అధ్యక్షులు కర్నా టి యాదగిరి గారు.శ్యామల తారక్. సురెపల్లి వెంకటేశ్వర్లు. పున్న రామేశ్వర్ .మూడ సైదులు.పొట్టబత్తుల శ్రీను.కైరంకొండ చంద్రశేఖర్.చెరుకు శివశంకర్. గంజి శ్యాంసుందర్ .జువ్వాజి సోమయ్య. తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలకు సన్మానం చేయడం జరిగింది.
నల్గొండ జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి ఉత్సవాలను ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

నల్గొండ జిల్లా కేంద్రా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ జయంతి 116వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ...

Apr 20 2024, 23:58
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
24.4k