నేడు భద్రాద్రిలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం
భద్రాద్రి లో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువారం శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవ ర్నర్ రాధాకృష్ణన్ దంపతు లు హాజరు కానున్నారు. మిథిలా కళ్యాణ మండ పంలో ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
కాగా బుధవారం శ్రీసీతారా ముల కళ్యాణోత్సవం కన్ను ల పండువగా జరిగింది. కల్యాణ వేదికపై వధూవ రులుగా జానకిరాములు ఆసీనులయ్యారు. వరుడి తండ్రి దశరథ మహారాజు తరఫున ఒకటి, వధువు తండ్రి జనక మహారాజు తరఫున ఇంకోటి.. భక్తుల తరఫున మరొకటి.. ఇలా రామదాసు చేయించిన ‘‘మూడు సూత్రాల మంగళ సూత్రం’’ వేదమంత్రోచ్ఛా రణల నడుమ సీతమ్మవారి మెడలో పడింది.
అణిముత్యములు తలం బ్రాలయ్యాయి. ఆ తలంబ్రా లు నీలమేఘశ్యాముడైన రాముడు తన దోసిట తీసుకోగానే నీలపురాశిగా మిలమిలలాడాయి! సీతమ్మ దోసిట్లోకి చేరగానే కెంపులై మెరిశాయి! జానకిరాముల శిరమున వెలసిన ఆ తలబంబ్రాల దెంత భాగ్యం.. ఆ జగత్క ల్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తకోటిదెంత పుణ్యం! ఆ భక్తి భావన మనసునిండా ఉప్పొంగగా భక్తజనమంతా అంతా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
ఇలా బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా భద్రా చలం క్షేత్రంలో సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిం చారు.
సర్కారు తరఫున పట్టువ స్త్రాలు, ముత్యాల తలం బ్రాలను సమర్పించిన తొలి సీఎస్ శాంతికుమారి కావ డం గమనార్హం. గురువారం రాముచంద్రమూర్తికి మహాప ట్టాభిషేకం నిర్వహించను న్నారు. మిథిలా స్టేడియం లోనే జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ రాధాకృష్ణన్ పట్టువస్త్రాలను సమర్పిం చనున్నారు..
Apr 19 2024, 07:50