ఏమ్మెల్సీ కవిత బెయిల్ కు కోర్టు నిరాకరణ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈరోజు తీవ్ర నిరాశ ఎదురయింది.
కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిం చింది. ఆమె బెయిల్ పిటి షన్ ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో… తనకు బెయిల్ మంజూరు చేయా లని కోర్టును కవిత కోరారు.
అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపిం చింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది.
ఈడీ వాదనలతో ఏకీభ వించిన కోర్టు… కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. రేపటి తో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియబోతోంది. ఆమె జ్యుడీషియల్ రిమాం డ్ ను కోర్టు పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Apr 08 2024, 12:43