నేడు తెలంగాణ లో 44 డిగ్రీలు దాటిన టెంపరేచర్
తెలంగాణ లో ఆదివారం కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావ రణ శాఖ హెచ్చరించింది.
దక్షిణ తెలంగాణలో వేడీ తీవ్రత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈదురుగాలులు, ఉరు ములు మెరుపులతో కూడిన వానలు పడతా యని వివరించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలతో పాటు జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, ములుగు, మహబూబా బాద్, వరంగల్, హనుమ కొండ, జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
ఉత్తర తెలంగాణకు అలర్ట్..
మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రికొత్త గూడెం, ఖమ్మం, సూర్యా పేట, నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా టెంపరేచర్ల నమోదవుతున్నాయి.
నల్గొండ జిల్లాలోని 30 మండలాలు, సూర్యాపేట లోని 18 మండలాలు, భద్రాద్రిలోని 19 మండలా లు, ఖమ్మంలోని 18, మంచిర్యాలలోని 11 మండలాలు, పెద్దపల్లి జిల్లాలోని 10 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..
Apr 07 2024, 21:15