/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz గోపరాజు పల్లి లో మంచినీటి సమస్యను పరిష్కరించాలి: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి Vijay.S
గోపరాజు పల్లి లో మంచినీటి సమస్యను పరిష్కరించాలి: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామంలో 300 కుటుంబాల రెండు వాటర్ ప్లాంట్ఉండగా తక్కువ సామర్థ్యం గల వాటర్ ప్లాంట్ ను పివి శ్యామ్ సుందర్ రావు ఫౌండేషన్ నుండి పెట్టుకోవడం జరిగింది .గతంలో ఉన్న వాటర్ ప్లాంట్ మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి విరాళం నుండి వాటర్ ప్లాంట్ నిర్మించుకోవడం జరిగింది అట్టి వాటర్ ప్లాంట్ చెడిపోయి శిథిల అవస్థలో మూడు మాసాల నుండి ఉన్నది గ్రామ సర్పంచ్ల కాలపరిమితి అయిపోయిన తర్వాత గ్రామపంచాయతీలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు .వర్షాలు తక్కువ పడడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగునీటి సమస్య పెద్ద సమస్యగా ఏర్పడింది అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి అన్నారు. దాతలు సహకారం లేక ఇబ్బందుల పాలవుతున్నారని,పంచాయతీ కార్యదర్శి మరియు స్పెషల్ ఆఫీసర్లు స్పందించి ప్రతిపాదనలు పంపాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో స్పందించి ప్రతిపాదనలు తీసుకొని నూతన వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసం సహకరించాలని ఒక ప్రకటనలో కోరారు.

మూర్తి గారి జనార్ధన్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శం: కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త


 ఏదీ గుడ్డిగా నమ్మకుండా, దాన్ని అధ్యయనం చేసి, తెలుసుకొని ఆచరించాలనే మూర్తిగారి జనార్థన్ ఆలోచన నేటి యువతకు ఆదర్శం కావాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం స్థానిక రెడ్డివాడలోని మూర్తిగారి జనార్ధన్ గృహములో జరిగిన మూర్తి గారి జనార్థన్ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ మూర్తి గారి జనార్థన్ అనేక సంస్థలకు చెందిన పుస్తకాలను , సాహిత్యాన్ని అధ్యయనం చేసి అందులోని విజ్ఞానాన్ని, హేతువాద దృక్పథం మరియు మానవత్వాన్ని కవితలుగా, శీర్షికలుగా, వ్యాసాలుగా వ్రాసి పత్రికలకు పంపిచేవారని ఆయన అన్నారు. మూర్తి గారి జనార్థన్ తన జీవితాంతం వందలాది పుస్తకాలు అధ్యయనం చేసారని ఆయన గుర్తుచేశారు. మూర్తి గారి జనార్థన్ ఆశయాలు చాలా గొప్పవని, వాటిని నేటి తరం తప్పక ఆచరించాలని ఆయన కోరారు. జనార్థన్ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు శ్రీనివాసాచార్యులు, జిట్టా భాస్కర్ రెడ్డి, షేక్ హమీద్ పాషా, బోగ మల్లేష్ మూర్తి గారి జనార్థన్ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

లోతుకుంట మోడల్ స్కూల్ లో ప్రశాంతంగా ముగిసిన మోడల్ ప్రవేశ పరీక్ష: ప్రిన్సిపల్ రాము


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట మోడల్ స్కూల్ లో 2024- 25 విద్యా సంవత్సరానిగాను ఆరవ తరగతి, ఏడు నుంచి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఆరవ తరగతి కి ,మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ఆరవ తరగతి నుండి పదవ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్, రాము మాట్లాడుతూ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని అన్నారు. ఉదయము ఆరవ తరగతి పరీక్షకు 16 మంది మధ్యాహ్నము ఏడవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో 17 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. మొత్తం 130 విద్యార్థులు హాజరై పరీక్షలు రాయడం జరిగిందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భాస్కర్, సిబ్బంది డి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి


భువనగిరి పార్లమెంట్ ఎన్నికల లో ఊసర వెళ్లిలా పార్టీలుమార్చేరాజకీయ నాయకులను ఓడించండి

 మచ్చలేని నాయకుడు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ గారిని గెలిపించండి

ఆదివారం సిపిఎం భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ గారిని గెలిపించాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోముఖ్య అతిధి గా పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అవకాశవాద రాజకీయనాయకులను ఓడించి ప్రజల కోసంపోరాటాలు నిర్వహించే ప్రశ్నించే ఉద్యమకారున్ని గెలిపించాలని కార్మికులు కర్షకులు పేదలు పోరాటాల ముద్దుబిడ్డ ఎండి జహంగీర్ ను భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు రాజకీయాలు అంటే కోట్లాది రూపాయల డబ్బు సంపాదించుకోవడమే లక్ష్యంగా నేటి రాజకీయ నాయకులు మారిపోయారని పదవుల కోసం పూటకో పార్టీ మారుస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఇలాంటి పరిస్థితులలో భువనగిరి పార్లమెంటుకు సీపీఎం పార్టీ అభ్యర్థి. 35 సంవత్సరాలుగా పేదల కోసం , రైతాంగానికి సాగునీటికోసo నిరాహారదీక్షలు , పాదయాత్రలుచేసి అనేకసమస్యలనుపరిష్క రించిన ఎండి జహంగీర్ గారిని ఎన్నికలలో అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని ఈ ఎన్నికలలో జహంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ప్రజలందరూ ఓటు వేసి అత్యధికమెజారిటీ ఓట్లతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలనిభువనగిరి పార్ల మెంట్ పరిధి లోపరిశ్రమలు, విద్యా,వైద్యం, ఐటీ,హబ్. గాఅభి వృద్ది జరగాలంటే 

ఢిల్లీ పార్లమెంట్ లో రావి నారాయణ రెడ్డి వారాసుడీ గా md జహంగీర్ కు ఓట్లు వేసిగెలిపించాలని

ఆయన ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మందల కార్యదర్శి

దయ్యాల నర్సింహా, మండలకమిటి సభ్యులు

ఎల్లంల వెంకటేశం, రైతు సంఘం జిల్లాకమిటిసభ్యులుజిట్టా అంజిరెడ్డి పార్టీ సీనియర్ నాయకులు బ త్తిని దానయ్య , అయిత రాజు కిష్టయ్య, ఎల్లంల అయి లయ్య, తదితరులు పాల్గొన్నారు.

జీవన శ్రీ జనరిక్ ఫార్మసీ, లక్ష్మీ ల్యాబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు


మాజీ ఎంపీపీ తుమ్మల నరసయ్య గారి జ్ఞాపకార్థం వలిగొండ మండల కేంద్రంలో జీవన శ్రీ జనరిక్ ఫార్మసీ లక్ష్మీ ల్యాబ్ సంయుక్తంగా ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచితంగా బిపి షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది దాదాపు 75 మంది ఈ సేవలను వినియోగించుకున్నారు జీవన శ్రీ జనరిక్ ఫార్మసీ నిర్వాహకులు పిట్టల సుధాకర్ లక్ష్మీ ల్యాబ్ నిర్వాహకులు పసుల సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ప్రతి నెల మొదటి ఆదివారం ఈ పరీక్షలు అందరికీ ఉచితంగా నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మోత్కూరు పట్టణంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారాలు


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలు మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మోత్కూరు పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో ట్రస్ట్ అధ్యక్షులు మోత్కూరి బ్రహ్మ ఆచార్య అధ్యక్షతన అవార్డుల ప్రధాన ఉత్సవం కొనసాగింది. నిస్వార్ధంగా సమాజ సేవ చేస్తున్న ప్రజా సేవకులను గుర్తించి మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఉగాది పురస్కారాలు ప్రధానం చేయడం అభినందనీయమని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు నరహరి తెలుగు ప్రాత్య కళాశాల విశ్రాంత ప్రధాన చార్యులు, గుర్రం కవిత లక్ష్మీనరసింహారెడ్డి మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ ఎస్ ఎన్ చారి రాష్ట్ర ఉత్తమ గ్రామీణ విలేఖరి ముఖ్య అతిథులుగా పాల్గొని పురస్కారాలు అందజేశారు. ట్రస్టు కార్యకలాపాలు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులను సన్మానించారు.

రాబోయే ఎన్నికల్లో ఫాసిస్టు బిజెపిని ఓడిద్దాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం: డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్


భువనగిరి: ఈ దేశం మూలవాసులైన దళితులపై దాడులను తీవ్రతరం చేసిన బిజెపిని రాబోయే ఎన్నికల్లో ఓడిద్దామని డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి( డి హెచ్ పి ఎస్)   యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ సమావేశం సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో కాశపాక దయాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ బిజెపి మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చాక దేశంలో మత సామరస్యం తీవ్రంగా దెబ్బతింది. దళితుల పైన దాడులు పెరిగినాయి. లౌకిక దేశాన్ని హిందూ రాజ్యాంగ మార్చడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతుంది.ప్రజలలో మత ప్రతిపాదికన చీలికలు తెచ్చి మతం ప్రజల వ్యక్తిగత జీవితాల నుండి రాజకీయాల్లోనికి చొరబడడం మూలంగా ఇది ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం. అంతేగాక మోడీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని తన గుప్పట్లోకి తీసుకుంది. స్వతంత్ర న్యాయవ్యవస్థ అస్తిత్వం కూడా ప్రమాదంలో పడింది. ఆర్ఎస్ఎస్ కన్ను సన్నుల్లోని బిజెపి పదేండ్ల పరిపాలనలో దేశం సరిహద్దు ఉద్రిక్తతలు, దేశంలోపల మత విద్వేషాలు, గ్రామాల్లో కుల ఘర్షణలు మినహా బిజెపి దేశ ప్రజలకు చేసింది ఈ సమంతా మేలు జరగలేదు. పైగా దేశ ప్రజలందరి గుండెకాయ లాంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి పూనుకుంది. రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ఒక పథకం ప్రకారంగా సకల ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ దేశంలో ప్రేరేపిస్తూ దేశంలో మత చిచ్చు రేపుతున్న మతోన్మాదులను వారి ఆలోచన విధానాలను వారి వల్ల ఈ దేశానికి జరిగేటువంటి నష్టాన్ని ప్రజలందరూ గమనించాలి.ఒకవైపు హిందూ రాష్ట్ర హిందువుల కోసం అని ప్రచారం చేస్తూ దేశమంతగా కార్పొరేటీకరణను వేగవంతం చేయడం హిందుత్వ ఫాసిస్టుల వ్యూహం. అందుకే దేశంలోని సమస్త ప్రజల సంపద కార్పొరేట్ల పరం అవుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా పబ్లిక్‌ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ పేరుతో అమ్మి వేస్తున్నారు. ఈ దేశ ప్రాకృతిక వనరుల మీద ఎటువంటి అధికారం ఉండదు. ఇవన్నీ పెట్టుబడిదారీ కార్పొరేట్‌ శక్తుల సంపదను పెంచడానికే తప్ప సాధారణ ప్రజల కోసం కాదు అని అన్నారు.

దేశంలో 20% దళితులు ఉండగా వారికి బడ్జెట్లో కేటాయింపులు 20 శాతం ఎందుకు కేటాయించట్లేదని విమర్శించారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై 300 రేట్లు దాడులు పెరిగాయన్నారు బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితులు అభద్రతలో జీవిస్తున్నారన్నారు.బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఖాయమన్నారు మతాన్ని దేవుడిని రాజకీయాల్లోకి జొప్పించి రాజకీయాల్ని కలుషితం చేయడం విద్వేషాలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం వంటి కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నారని విమర్శించారు బిజెపి పాలనలో దళితులు గిరిజనులు మహిళలు ఆదివాసీలకు ఏమాత్రం రక్షణ లేదన్నారు రాజ్యాంగ రక్షణకు బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాస్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాశపాక దయాకర్, ఎర్రోళ్ల లింగస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సిలిగంజి వీరస్వామి,

ఎల్లంకి మహేష్, ఉప్పుల శాంతి కుమార్,ఇంజా హేమలత,కొమ్ము బాలు నరసింహ, చుక్క చంద్రశేఖర్, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల శాఖ ఆధ్వర్యంలో టిఫిన్ బైటక్ కార్యక్రమం


బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏప్రిల్ 6, సందర్భంగా భారతీయ జనతా పార్టీ 44 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో బిజెపి నాయకులు,కార్యకర్తలు ఇండ్ల ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరియు పార్టీ పిలుపుమేరకు ఈరోజు బూతులలో నాయకులు కార్యకర్తలు టిఫిన్ బైటెక్ కార్యక్రమంను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థగతంగా పార్టీ నిర్మాణం గురించి మరియు వచ్చే లోకసభ ఎన్నికల్లో భువనగిరి నుండి బూర నర్సయ్య గౌడ్ గారిని ఏ విధంగా గెలిపించుకోవాలో ప్రణాళికలను రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భోళ్ళ సుదర్శన్, బందారపు లింగ స్వామి గౌడ్ , రాచకొండ కృష్ణ కొప్పుల యాదిరెడ్డి, దంతూరి సత్తయ్య, కనతాల అశోక్ రెడ్డి,లోడే లింగస్వామి, బందారపు రాములు,అప్పిషెట్టి సంతోష్, దయ్యాల వెంకటేష్, మందుల నాగరాజు, రేగురి అమరేందర్, పిట్టల రాజు, తదితరులు పాల్గొన్నారు.

మునిపంపుల గ్రామంలో తాటి చెట్టు నుండి జారిపడి గీత కార్మికునికి తీవ్ర గాయాలు


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామ నివాసి కునూరు పాండు తండ్రి సత్తయ్య వయసు 48 ఈరోజు ఉదయం రోజువారి వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తున్న క్రమంలో కాలుజారి కింద పడడం జరిగింది నడుము వెన్నుపూస మరియు ఎడమ కాలు కు దెబ్బలు తగిలినవి తోటి గీత కార్మికులు కుటుంబ సభ్యులు కలిసి రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు .

విషయం తెలవగానే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పులిబిక్షం మండల నాయకులు తూర్పునూరు శ్రీనివాస బావుండపల్లి బాలరాజు బాలగోని మల్లయ్యగంగాపురం సైదులు మామిండ్ల రవి తేజ బాధితుని కునూరు పాండును పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.  మాట్లాడుతూ పాండుకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి ప్రభుత్వం ప్రమాదాలు నివారణకు సేఫ్టీ మోకులు అందించి గీత కార్మికుల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారుఎక్స్ గ్రేషయా నెలరోజుల లోపే వారి కుటుంబానికి అందించాలని కోరారు.

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో జరగని జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు, కలెక్టర్ ఆదేశాలిచ్చి సాయంత్రంలోగా జరుగుటకు చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్


యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బా రామకృష్ణ మాట్లాడుతూ ఈరోజు శుక్రవారం బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించలేదని అన్నారు. కలెక్టర్ ఆఫీస్ నుండి గ్రామపంచాయతీ వరకు అన్ని ఆఫీసులలో జయంతులు నిర్వహించేదని, ఈసారి ఎలక్షన్ కోడ్ ఉన్నందున స్టాచు దగ్గరే జయంతి జరిపాలని అధికారులు చెబుతున్నారని అన్నారు. బాబు జగ్జీవన్ రావ్ మహనీయుని వలనే ఈరోజు సెలవు తీసుకుని ఒక గంట సేపు జయంతి కోసం కేటాయించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ అధికారులకు ఆదేశాలిచ్చి సాయంత్రం వరకు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ తదితర కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించాలని కోరారు. లేనియెడల దళిత సంఘాలు కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామని అన్నారు..