/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర Raghu ram reddy
అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేప థ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.

సాయంత్రం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లి డైట్‌ కళాశాల సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్‌ లో ఏర్పాటుచేసిన హెలీ ప్యాడ్‌కు చేరుకుంటారు.

అక్కడ నుంచి రింగ్‌రోడ్డులో గల ఎన్టీఆర్‌ విగ్రహం కూడలి, చేపలబజారు, చిన్న నాలుగురోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్‌, వేల్పుల వీధి మీదుగా నెహ్రూచౌక్‌ జంక్షన్‌ వరకూ వారాహి వాహనంలో రోడ్డుషో నిర్వహిస్తారు.

నాలుగు గంటలకు నెహ్రూచౌక్‌ కూడలిలో వారాహి వాహనం మీద నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించున్నారు

బిడ్డ నీకు...కచ్చితంగా చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా?: సీఎం రేవంత్ రెడ్డి

తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శనివా రం రాత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ నేతలు నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మాట్లాడే భాష ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. 

అడవి పందిలా పదేళ్ల పాటు తెలంగాణను సర్వనాశనం చేశారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేశారు. మీ కాలు విరిగిందని, మీ కూతురు జైలుకి పోయిందని కొంతకా లం మేము సంయమనం పాటించా. అలా అని.. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకో వడానికి నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని అని గుర్తు పెట్టుకో బిడ్డా. మా కార్యకర్తలతో జాగ్రత్త” అంటూ చెలరేగి పోయారు సీఎం రేవంత్ రెడ్డి.

నీ లత్కోర్ మాటలకు చర్ల పల్లి జైల్లో చిప్పకూడు తిని పిస్తా. నువ్వు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వలేదు. నేను మాత్రం నీకు తప్పకుండా చర్లపల్లి జైల్లో డబుల్ డెబ్ రూమ్ ఇల్లు కట్టిస్తా. బిడ్డా.. నీ కొడుకు, కూతురు, అల్లుడు, నువ్వు.. అందరూ కలిసి ఉండేలా జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా” అని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.

నాడు.. బీఆర్ఎస్ ను తొక్కి నట్లే.. బీజేపీని కూడా తుక్కు తుక్కుగా తొక్కు దాం. కార్యకర్తల రక్త త్యాగంతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది. గుజరాత్ మోడల్ కాదు.. ఇక వైబ్రెంట్ తెలంగాణ. 700 మంది రైతులను చంపినందుకు మోడీకి ఓటేయాలా..?

దేశాన్ని విభజన చేసే కుట్ర చేస్తున్నందుకు మోడీకి ఓటేయాలా..? నమో అంటే.. నమ్మితే మోసం. పదేళ్లైనా విభజన హామీలు అమలు చేయనందుకు బీజేపీకి ఓటేయాలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు..

మా 100 రోజుల పాలన చూసి 14 సీట్లలో గెలిపిం చండి. రాహుల్ ప్రధాని కావాలంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలి.

దేశం మొత్తం పాదయాత్ర చేసి.. ప్రజల బాధలు తెలి సిన రాహుల్.. విమానాల్లో తిరుగుతూ.. పూటకో డ్రస్ మార్చే మోడీ కాదు. నరేంద్ర మోడీ పరివార్.. ఈడీ, సీబీఐ. మాది దేశం కోసం త్యాగం చేసిన గాంధీ పరివార్.

ఈ ఎన్నికలు మోడీ పరి వార్, గాంధీ పరివార్ మధ్య. తెలంగాణ సమాజానికి గాంధీ కుటుం బం అండగా ఉంటుంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు..

ములుగు జిల్లాలో అడవికి అంటుకున్న కార్చిచ్చు: వందల ఎకరాల్లో అడవి దగ్ధం

ములుగు జిల్లాలోని పస్రా తాడ్వాయి అటవీ ప్రాంతం లో కార్చిచ్చురగులుకుంది. ఆదివారం ఉదయం సంభ వించిన అగ్ని ప్రమాదంలో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమవుతున్నది.

ప్రాణ భయంతో వన్య ప్రాణులు పరుగులు తీశాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

భారీగా పొగ మంచు కమ్ము కోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన చిరుజల్లులు

భానుడి భగభగలతో అల్లా డి పోతున్న ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలకు కొంత ఉపశ మనం కలిగింది. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తారుగా చిరుజల్లులు కురిశాయి.

ఇన్ని రోజులు ఎండ తీవ్రతో ఇబ్బందులు పడ్డ ప్రజలు చిరు జల్లులతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావ రణ హైదరాబాద్‌ విభాగం చల్లటి ముచ్చట చెప్పింది.

ఆదివారం నుంచి తెలంగా ణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.

ఆదివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

సోమవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫా బాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్‌లో మాత్రం కురిసే అవకాశం లేదని స్పష్టంచేసింది. 7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్ర దేశ్‌, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది..

మహబూబ్ నగర్ జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందిన సంఘటన మహ బూబ్‌నగర్ జిల్లా మూసా పేట మండల పరిధిలోని కోమిరెడ్డిపల్లి గ్రామ శివారు లో శనివారం రాత్రి జరిగింది.

పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం… ఎండాకాలం కావడంతో చిరుతలు నీళ్ల కోసం అడవుల నుంచి గ్రామాల వైపుకు వస్తున్నా యి. చిరుత రోడ్డు దాటే క్రమంలోగుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డు పక్కన పడిపోయింది.

వాహనదారులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకన్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....

AP News: తిరుపతిలో 15 ఏనుగుల బీభత్సం.. అన్నదాతల కన్నీరు.

తిరుపతిలో (Tirupati) ఏనుగుల బీభత్సం అంతా ఇంతా కాదు. గజరాజుల (Elephants) విజృంభన రైతులకు ఆవేదనను మిగిల్చింది. గత కొద్ది రోజులుగా ఏనుగుల హల్‌చల్‌తో రైతులు బెంబేలెత్తిపోతున్నారు..

రేణిగుంట మండలం చైతన్యపురం గ్రామంలో ఏకంగా 15 ఏనుగుల సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల బీభత్సంతో పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో మామిడి పంటపై ఆధారపడ్డ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

దాదాపు 80 ఎకరాల్లో మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయని రైతులు వాపోతున్నారు. గజరాజుల విహారంపై అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం మాత్రం శూన్యం అని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల నుంచి మామిడి చెట్లను రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి తమ వద్దనున్న బాణాసంచాను పేల్చి రైతులు ఏనుగులను తరిమే ప్రయత్నం చేశారు. అయినా ఎలాంటి లాభం లేకుండా పోయిందని అన్నదాతలు చెబుతున్నారు. పూర్తిగా నష్టపోయిన తమను ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు..

AP Newws: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన ఈసీ

అమరావతి: మూడు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీలను కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) గురువారం నాడు నియమించింది. కృష్ణా కలెక్టర్ గా కె.బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్ నియమించింది..

గుంటూరురేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిఫాఠి, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు. అనంతరపురం ఎస్పీగా అమిత్ బద్దార్, నెల్లూరు ఎస్పీగా అరీఫ్ హఫీజ్ నియమించింది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు రాత్రి ఎనిమిది గంటలల్లోపు ఈ అధికారులు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. రెండు రోజుల క్రితం ఐదు జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, ముగ్గురు కలెక్టర్లను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆరోపణల నేపథ్యలో వీరిని బదిలీ చేసి, కొత్తవారిని కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది..

వైకాపా చేసే తప్పులను చంద్రబాబుపై నెట్టేస్తున్నారు: భువనేశ్వరి

కడప: వైకాపా చేసే ప్రతి తప్పును తెదేపా అధినేత చంద్రబాబుపై నెట్టేస్తున్నారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పింఛన్ల విషయాన్ని కుట్రపూరితంగా ఆయనకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు..

వైకాపా రాక్షస పాలనలో చంపడం, హింసించడం అలవాటుగా మారిందని విమర్శించారు. 'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా ఆమె కడపలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన చెండ్రాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని అన్నారు..

టిప్పర్‌ డ్రైవర్‌కి టికెట్‌ ఇస్తే తప్పేంటి బాబూ?: సీఎం జగన్‌

తిరుపతి : చంద్రబాబు కారణంగానే ఇవాళ వృద్ధులు పింఛన్‌ కోసం ఎండలో నిలబడాల్సి వచ్చిందని.. వలంటీర్లపై నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది టీడీపీనేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు..

గురువారం మధ్యాహ్నాం తిరుపతి జిల్లా చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.

"ఒక టిప్పర్‌ డ్రైవర్‌కు సీటు ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేశారు. టిప్పర్‌ డ్రైవర్‌ను చట్ట సభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా. ఒక టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇస్తే తప్పేంటి?. ఏం తప్పు చేశానని టీడీపీ ఇవాళ నన్ను అవహేళన చేస్తోందని" సీఎం జగన్‌ నిలదీశారు.

"వీరాంజనేయులు(శింగనమల నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి) ఎంఏ ఎకనామిక్స్‌ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా వీరాంజనేయులు బాధపడలేదు. ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే టీడీపీలో కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని" ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రస్తావించారు..

Avinash Reddy Bail: అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..

Avinash Reddy Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం విచారణ జరిగింది..

ఈ పిటిషన్‌పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి(Dasthagiri) తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు. దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి.. తాను జైల్లో ఉన్న సమయంలో ప్రలోభాలకు గురిచేశాడని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన తండ్రి పైనా అవినాష్ అనుచరులు దాడి చేశారని గుర్తు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి చాలా ప్రభావితమైన వ్యక్తి అని, ఆయనకు వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు పిటిషనర్ తరుపు న్యాయవాది.

మరోవైపు దస్తగిరికి ప్రాణ హానీ ఉందని సీబీఐ వాదించింది. దీనికి ప్రతిస్పందించిన హైకోర్టు.. దస్తగిరిక ప్రాణ హానీ ఉందని మీరు ఇప్పుడు ఎలా చెబుతున్నారు? అని ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సీబీఐని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు స్పందించిన సీబీఐ.. సుప్రీంలో బెయిల్ రద్దు చేయాలని సవాల్ చేసే లోపే వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టుకు వెళ్లిందని పేర్కొంది. దీంతో సీబీఐ సైతం సునీత పెటిషన్‌లో కౌంటర్ దాఖలు చేశామని హైకోర్టుకు సీబీఐ వివరణ ఇచ్చింది.

కాగా, విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐకి నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమకు ప్రాణాహనీ ఉందని దస్తగిరి భార్య, దస్తగిరి ఇద్దరూ సీబీఐకి ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై ఇంకా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన హైకోర్టు.. విట్‌నెస్ ప్రొటెక్షన్ రిపోర్ట్ వచ్చాక పరిశీలించి నిర్ణయం తీసుంటామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది..