ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన చిరుజల్లులు
భానుడి భగభగలతో అల్లా డి పోతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశ మనం కలిగింది. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తారుగా చిరుజల్లులు కురిశాయి.
ఇన్ని రోజులు ఎండ తీవ్రతో ఇబ్బందులు పడ్డ ప్రజలు చిరు జల్లులతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావ రణ హైదరాబాద్ విభాగం చల్లటి ముచ్చట చెప్పింది.
ఆదివారం నుంచి తెలంగా ణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.
ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫా బాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్‌లో మాత్రం కురిసే అవకాశం లేదని స్పష్టంచేసింది. 7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్ర దేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది..
Apr 07 2024, 12:15