కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గా,నారాయణ శ్రీగణేశ్: ప్రకటించిన కాంగ్రెస్ హై కమాండ్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేసింది.
ఈ మేరకు శనివారం ఏఐ సీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. గణేష్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ అభ్యర్థిపై అనేక చర్చల అనంతరం చివరకు గణేష్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటో న్మెంట్ స్థానం ఖాళీ అయ్యిం ది.బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ల్యాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపో వడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
మే 13న కంటోన్మెంట్ ఉపఎన్నిక జరుగనుంది. ఎన్నికలకు సర్వం సిద్ధమ వుతున్న తరుణంలో ఆయా పార్టీలు కంటోన్మెంట్‌లో పోటీ చేయబోయే అభ్య ర్థుల ఎంపికపై దృష్టి సారిం చాయి.
ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధిం చాలనే ఉద్దేశంతోనే ముందు కు సాగుతోంది. కంటోన్మెంట్ లో పోటీ చేయబోయే అభ్య ర్థి ఎంపికపై దృష్టి పెట్టి కాంగ్రె స్.. శ్రీ గణేష్ పేరును అధికా రికంగా ప్రకటించింది.
కంటోన్మెంట్ కోసం కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగొ లు నాలుగుసార్లు సర్వేలు చేయగా.. కంటోన్మెంట్‌లో అరవ మాల సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
శ్రీ గణేష్ అరవ మాల సామాజికవర్గం కావడంతో హస్తం నేతలు అతడి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లేనందున కంటోన్మెంట్ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది...
Apr 07 2024, 10:23