నేడు రాజస్థాన్ రాయల్స్ తో RCB "డీ "
ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడి యంలో పోటీ పడబోతు న్నాయి.
రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవు తుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి ఇది నాలుగు, బెంగళూరుకు ఐదో మ్యాచ్ కానుంది.అలాగే, ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు జట్లు మొత్తం 30 సార్లు పోటీ పడగా.. రాజస్థాన్ కంటే బెంగళూరు అగ్రస్థానంలో ఉంది.
ఇక, ఆర్సీబీ 15 మ్యాచ్‌లు గెలవగా, రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసుకుంది. ఇక, 3 మ్యాచ్‌ల ఫలితం రాలేదు.. 2020 నుంచి రాజస్థాన్ vs బెంగళూరు మధ్య మొత్తం 9 మ్యాచ్‌లు జరగ్గా.. ఈ 9 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది.
2022లో పూణెలోని ఎంసీ ఏ స్టేడియంలో బెంగళూరు పై రాజస్థాన్ 29 రన్స్ తేడాతో విజయం సాధిం చింది.ఇక, జైపూర్ పిచ్ వేదికగా ఆడిన రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌లకు మద్దతు ఇస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు దాదాపు 185 పరుగులకు పైగా స్కోర్ చేసింది.
అయితే రెండు పర్యాయా లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు లక్ష్యాన్ని కాపాడు కుంది. ఇది సవాయ్ మన్ సింగ్ స్టేడియం యొక్క పిచ్ ఆట సాగుతున్నప్పుడు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే, ఇవాళ వర్షాలు కురిసే అవకాశం లేదు.. ఉష్ణోగ్రతలు సాయం త్రం 20 శాతం తేమతో 30 డిగ్రీల సెల్సియస్‌గా నమోద వుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
రాజస్థాన్ జట్టు: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, నాంద్రే బెర్గర్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ కృష్ణ, సందీప్ శర్మ.
బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, యశ్ దయాల్, రీస్ టాప్లీ, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్...
Apr 06 2024, 14:35