నేడు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
•హాజరుకానున్న ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, రేవంత్
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల శంఖారావం నేడు పూరించనుంది. పది లక్షల మందితో భారీ బహిరంగ సభ తలపెట్టింది.
రంగారెడ్డి జిల్లా తుక్కు గూడలో జన జాతరను తలపించేలా భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేసింది. ఈవేదిక నుంచి దేశ ప్రజలకు ఐదు గ్యారంటీలతో భరోసా ఇవ్వనుంది. శుక్రవారం ఢిల్లీలో ఇప్పటికే ఏఐసీసీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్… శనివారం జనజాతర సభలో తెలుగు అనువాద మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది.
సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య మంత్రులు హాజరుకాను న్నారు.
మూడు భారీ వేదికలు…ఏర్పాట్లు పూర్తి
కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 70 ఎకరాల్లో రాజీవ్‌గాంధీ పేరుతో ప్రాంగణం, 50 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసింది. ఈ సభకు పది లక్షల జనాన్ని తరలిం చనున్నారు. మ్యానిఫెస్టోను రాహుల్‌గాంధీ విడుదల చేయనున్నారు.
సభా ప్రాంగణంలో మూడు భారీ వేదికలు ఏర్పాటు చేసింది. మొదటి వేదికపై ఏఐసీసీ అగ్రనేతలతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నారు.
రెండో వేదికపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు కూర్చొనేలా ఏర్పాటు చేసింది. మూడో వేదిక కళాకారుల కోసం ఏర్పాటు చేశారు. వంద లాది మంది కళాకారులతో ఆటా,పాటలతో ప్రజలను ఉత్తేజపరించేందుకు రెడీ అవుతున్నది.
పదేండ్ల నరేంద్రమోడి ప్రభుత్వ నియంతృత్వ, దుష్పరిపాలనకు తెరదించి దేశంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని పునరు ద్ధరించేందుకు తుక్కుగూడ సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేదిక నుంచే మోడీకి దీటైన సమాధానం ఇవ్వాలని భావిస్తున్నది.
తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో తెలియజేసే మ్యానిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేయనుం ది. దీంతో తుక్కుగూడ సభపై తెలంగాణ ప్రజల తోపాటు దేశంలోని ప్రతి ఒక్కరిలోనూ, ఇతర రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది.
Apr 06 2024, 14:26