వాత పెట్టిన వాగ్దానం మారలేదు
ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిచేందుకు అనేక హామీలు ఇస్తుండటం సహజం .. అయితే ఓ క్యాండిడేట్ ఎన్నికల వాగ్ధానాలలో కాస్త కిక్కు ఇచ్చింది
మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్య ర్థిగా పోటీ చేస్తున్న వనితా రౌత్ పేదలకు సబ్సిడీ పై బీరు, విస్కీ అందిస్తానని హామీలు ఇచ్చేసింది.
ప్రతి గ్రామంలో బీరు బార్లు ఓపెన్ చేసి ఎంపీ నిధుల నుంచి విదేశీ మద్యంతో పాటు విదేశీ బీర్లను కూడా ఇస్తానని చెబుతోంది. ముందుగా ఈ షాపులలో ప్రీగా మందు అందిస్తానని వాగ్దానం చేసేసింది.
ఇండియన్ లిక్కర్ కాకుండా విదేశీ మద్యం అందుబాటు లో ఉంచుతానని ఘంటా పధంగా చెపుతున్నది.. దీంతో ఆమె ప్రచారానికి జనాలు పోటేత్తుతున్నారు.
తాగేందుకూ లైసెన్స్….
అయితే ఈ స్కీమ్ కింద తాగేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరికీ లైసెన్స్ ఉండాల్సిందే నన్న కండీషన్ పెడుతోంది. అత్యంత కష్టపడి పనిచేసే పేదలకు ఉన్న ఒకే ఒక విలాసం మందు తాగడ మని, ఇందుకే తన ఈ వినూత్న స్కీమ్ వారికి అవసరమని సమర్థించు కుంటోంది.
పేదలకు అందుబాటులో ఉండేది కేవలం దేశీయ మద్యమేనని, ఇది తాగి వారు చనిపోతున్నారని, ఇందుకే వారి కోసం విదేశీ మద్యం తెప్పించి ఇస్తానని తెలిపింది.
గత ఎన్నికలో ఇదే వాగ్ధానం… వాతపెట్టిన ఎన్నికల సంఘం…
వనిత ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్ నుంచి పోటీ చేయగా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిమూర్ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచారు. గతంలో కూడా విస్కీ, బీరు హామీ ఇచ్చినందుకు ఆమె సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎన్నికల కమిషన్ జప్తు చేసింది. అయినా ఆమె మారకుండా మళ్లీ అదే హామీ ఇస్తుండటం విశేషం.
Apr 02 2024, 10:24