మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ
భువనగిరి : రంజాన్ పవిత్ర మాస ఉపవాసా దీక్షలు పాటిస్తున్న నిరుపేద ముస్లిం కుటుంబాల కు మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ సౌజన్యంతో రెండవ రోజు సోమవారం మైనార్టీ వెల్ఫేర్ సొసై టీ జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్,ఇస్తి యాక్ అహ్మద్ ల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్ మసీదు వద్ద నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక మదర్ థెరిస్సా హైస్కూల్ కరస్పాండెంట్ సురేష్ కుమార్ మాట్లా డుతూపవిత్ర రంజాన్ మాసంలో నిరుపేద ముస్లిం కుటుంబాల సంక్షేమాన్ని దృష్టియందుం చుకొని స్వచ్ఛందంగా నిత్యవసరాలు పంపిణీ చేస్తున్న ఇంతియాజ్ అహ్మద్, ఇస్తియాక్ అహ్మద్ లు చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి అభి నందించారు.భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.దీనికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు.
అనంతరం ఇంతియాజ్ మాట్లాడుతూ నిరుపేద ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ నదీమ్ ఖాన్ సహకారంతో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగు తుందన్నారు. ప్రతి ఏటాలాగే ఈసారి కూడ మేరాజ్ గ్రూప్ వారి సౌజన్యంతో ఇప్పటికే ఆదివారం రెండు లక్షల రూపాయల విలువగల నిత్యవసర సరు కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా సోమవారం రెండవ విడతలో భాగంగా పట్టణంలోని పేద ముస్లిం కుటుంబాల కు ఒక్కొక్కరికి 3000.రూపాయల రంజాన్ తోఫా కిట్టును మరో రెండు లక్షల రూపాయల తో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు . తమపై ఎంతో నమ్మకంతో ప్రతి ఏటా భువనగిరి పట్టణంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు తమ వంతు సహాయంగా నిత్యవసర సరుకులు అందజేస్తున్న మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ నదీమ్ ఖాన్ కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసంలో పేదలను గుర్తించి వారికీ తమకు తోచిన సహాయం అందించాలన్నదే తమ లక్ష్య మన్నారు.ఈ కార్య క్రమంలో టీజేయు జిల్లా అధ్యక్షుడు ఎండి శానూర్ బాబా,మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీఇస్తియాక్ అహ్మద్,సయ్యద్ రఫీఖ్ అహ్మద్,ఎండీ కామ్రాన్ హుస్సేన్,ఎండీ సలీం ఎండీ గయాజ్ అహ్మద్ ఎండీ సిరాజ్, ఎండీ మొఖ్తార్,అహ్మద్,ఆదిల్ రాషేద్,షకీల్,రెయ్యాన్ తదితరులు పాల్గొన్నారు.
Apr 01 2024, 22:25