తెగిన నిజాంసాగర్ కాలువ కట్ట..ఇండ్లలోకి చేరిన నీరు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిజాంసాగర్ కాలువ తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపో యింది.
దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చిచేరింది. మధ్య రాత్రి వేళ ఒక్కసారిగి నీరు ఇండ్లలోకి రావడంతో కాలనీవాసులు పరుగులు పెట్టారు.
నీటి ప్రవాహానికి విద్యుత్ స్తంభాలు కింద పడిపోయా యి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపో యింది. అయితే కాలువ తెగిపోవడానికి ఇరిగేషన్ అధికారుల నిరక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అధికారులు తక్షణమే సహా యక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీటిని వదిలే సమయంలో.. నీటిపారుదల అధికారులు కాలువను శుభ్రం చేయాల్సి ఉంది.
అయితే ఆర్మూర్ ప్రాంతం లోని అధికారులు అవేవీ పట్టించుకోలేదు. దీంతో ప్రధాన కాలువ మురికి కూపంలో తయారై చెత్తా చెదారంతో నిండిపోయింది. కాగా,
ప్రజలకు తాగురు, రైతులకు సాగునీటి కోసం ప్రాజెక్టు అధికారులు కాలువలోకి నీటిని వదిలారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో కాలువ తెగిపోయిందని చెప్పారు..
Apr 01 2024, 15:02