ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
లిక్కర్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమా ర్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తు తం ఆమె తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అయితే తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయా లని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.
తన చిన్న కుమారుడు పరీక్షలు రాస్తున్నారని, ఈ మేరకు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయా లని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టు సీబీఐ ప్రత్యేక కోర్ట్,లో సోమవారం విచారణ జరగనుంది.
ఈ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు న్యాయ మూర్తి కావేరి బవేజా విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అవుతుందా?లేదా?అనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.
మరోవైపు ఈడీ అధికారులు మాత్రం ఎమ్మెల్సీ కవితను బెయిల్ ఇవ్వొద్దని కోరుతు న్నారు. లిక్కర్ స్కామ్ కేసు లో కవిత ప్రధాన సూత్రధారి గా ఉన్నారని, దాదాపు రూ.100 కోట్ల మేర అక్ర మాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది..,
Apr 01 2024, 10:29