ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీల విజేతలకు బహుమతులు ప్రధాన చేసిన ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర
వలిగొండ మండలంలోని అరూరు గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సుద్దాల సాయికుమార్ అధ్యక్షతన జరిగినది
అవినీతి, అక్రమాలను పారద్రోలడానికి యువత రాజకీయాలకు ఆకర్షితులు కావాలని, చెడు వ్యసనాలను దూరం చేసేందుకు,ఆరోగ్యవంతులుగా ఉండేందుకు క్రీడలు అవసరమని ఏ ఐ వై ఎఫ్ వలిగొండ మండల సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రీడోత్సవాల ముగింపు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆరూరు లోని జరిగింది. ఈ ప్రధానోత్సవ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర, సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ముఖ్య అతిథిలుగా , క్రికెట్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు లింగరాజు పల్లి కి మొదటి బహుమతి, ఆరూరి కి రెండవ బహుమతి, బహూకరించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధర్మేంద్ర మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా అవసరమని, గ్రామీణ స్థాయి నుండే క్రీడలను ప్రోత్సహించి అధిక నిధులు కేటాయించాలన్నారు.ప్రస్తుత సమాజంలో యువత, విద్యార్థులు కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమైన సమయంలో, యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఏ ఐ వై ఎఫ్ క్రీడలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని వారు అన్నారు.క్రీడలు ప్రతి మనిషి జీవనంలో ఒక వ్యాయామంగా మారాలని, మానసిక పునరుత్తేజానికి, ఆరోగ్యకరమైన జీవనానికి ఆవశ్యమని వారు ఉద్ఘాటించారు. పౌష్టికాహార లోపంతో యువత శారీరకంగా ఎదుగుదల కొరవడిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.నిత్యం యువత క్రీడల్లో పాల్గొనటం ద్వారా చెడు వ్యసనాలకు దూరం కావొచ్చని, నేడు రాష్ట్రంలో మాధకద్రవ్యాలకు బానిసై అనేక మంది విద్యార్థులు, యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వ్యాసనాల మత్తులో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు అన్నారు. అదేవిధంగా ప్రస్తుత రాజకీయాలు అవినీతి, అక్రమాలతో తారవిల్లుతోందని, కేవలం బడా కార్పొరేట్ వ్యాపార బడా బాబులు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారని దీని వలన సమాజ మార్పు సాధ్యం కాదని, కేవలం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే స్థానం ఉంటుందని, ఇది సమాజ నిర్మాణానికి విఘాతం కల్గిస్తుందని వారు విమర్శించారు. అందుకే నేటి నవతరం రాజకీయాలకు ఆకర్షితులు కావాలని, రాజకీయాలంటే నిస్వార్థ సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ చీలికలు తెచ్చి అశాంతిని నెలకొల్పుతున్నదని,అదే విధానాలను తెలంగాణ లో కూడా అమలు చేయాలని ప్రజల మధ్య మతం రంగు తో అల్లర్లు నిర్వహించాలని బీజేపీ కుట్రలు పన్నుతున్నదని ఈ దుష్ట చర్యలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని, బీజేపీ ని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని వారు పిలుపునిచ్చారు. ఇటీవల మేడ్చల్ జిల్లా చెంగిచర్ల ప్రాంతంలో జరిగిన ఘటన అదే కోవలోకి వస్తుందని, రెండు మతాల మధ్య వైరుధ్యాలను సృష్టించి ఘర్షణలకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు. కేవలం ఎన్నికల సమయంలోనే బీజేపీ ఈ నీచపు అకృత్యాలకు పాల్పడటం సిగ్గు చేటు అన్నారు.
ఈ సందర్భంగా పోలేపాక యాదయ్యమాట్లాడుతూ యువతను మతోన్మాద రాజకీయాల వైపు మళ్లిస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని, దేశ ఐక్యత అంటే అన్ని మతాలు, కులాల సమూహమేనని చాటి చెప్పే విధంగా యువత సన్నద్ధం కావాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్, పెరబోయిన మహేందర్,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బబ్బురి శ్రీధర్, నాయకులు మేడి దేవేందర్, మారుపాక వెంకటేష్,ఎం.డి నయీమ్, బహుమతి దాత చిలకమర్రి నారాయణ, దుప్పల్లి జావిద్, జక్కడి శ్రీనివాసరెడ్డి, రవ్వ శివ, జోలం మల్లేష్, మహేష్, మెట్టు సంతోష్, మారుపాక లోకేష్, తదితరులు పాల్గొన్నారు
Mar 31 2024, 20:52