నేతన్నలతో రాజకీయాలు మానండి: బీసీ రాజాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్
నేతన్నలతో రాజకీయాలు మానండి..
పద్మశాలీల్లో బలమైన నాయకత్వలేమితోనే సమస్యలు
దాసు సురేశ్ - బీసీ రాజ్యాధికార సమితి
ప్రస్తుతం సిరిసిల్లలో నేత కార్మికులు ఎదుర్కుంటున్న దుర్బర పరిస్థితిలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిష్కరించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు..గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల పేరిట కొంతమంది మాస్టర్ వీవర్లకు లబ్బి చేకూర్చే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నేడు నేత కార్మికులు పనిలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దాసు సురేశ్ తెలిపారు.. బతుకమ్మ చీరల పేరిట నెలకొని ఉన్న 270 కోట్ల రూపాయల బకాయిలను, చేనేత సహకార సంఘాలకు చెల్లుంచాల్సిన 9 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే చెల్లించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు..
![]()
రాజకీయ కారణాలతోనే ప్రస్తుతం సిరిసిల్లలో కష్టాలను ఎదుర్కొంటున్న నేతన్నల పక్షాన కేటీఆర్ మాట్లాడడం లేదని వారి హయాంలో ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించిన బకాయిలను రాబట్టడానికి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని నేటికీ ఈ అంశంపై కనీసం స్పందించకపోవడం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు
![]()
కష్టకాలంలో ఉన్న నేతన్నలను ఓదార్చడం మాని స్థానిక కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్రెడ్డి నేతన్నల పట్ల దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటని తెలిపారు.. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాలతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలలో సాలీనా కావాల్సిన వస్త్ర వినియోగాన్ని లెక్కించి సమీకృత ప్రొడక్షన్ విధానాన్ని అధికారులు నిర్ణయించుకోకపోవడమే సమస్యకు అసలు కారణమని తెలియజేశారు.. అధికారులు వెంటనే ప్రొడక్షన్ ప్లాన్ ను తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి కావాల్సిన వ్యయం మొత్తాన్ని సమీకరించాలని కోరారు.. ఆపద కాలంలో నేతన్నలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలకు పాల్పడకుండా ధైర్యంగా మెదలాలన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయడంతో పాటు కార్మికులు తమ త్రిఫ్ట్ నిధినుండి లోను సౌకర్యాన్ని పొందే విధంగా వెసులుబాటు కల్పించాలన్నారు.. కార్మికులకు శీఘ్రగతిన ముద్ర లోన్ సదుపాయాన్ని కూడా అందజేసే విధంగా స్థానిక ఎంపీ బండి సంజయ్ కృషి చేయాలన్నారు
త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నేతన్నల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే విధంగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసురేష్ మీడియాకు తెలిపారు.





కనీసం వారికి బస్సుకు ఆటోకు వెళ్లడానికి చార్జీలు కూడా ఇవ్వడం లేదు కావున నిత్యవసర ధరలకు చార్జీలకు అనుకూలంగా అప్రెంటిస్ చేస్తున్న నర్సులకు ఎంతోకంతా వేతనాలు చెల్లించాలని.. ఇక్రూట్మెంట్లు సరిపడా బెడ్లు హాస్పిటల్ కి సరిపడా పరికరాలు లేకపోవడం కారణంగా చర్ల మండలంలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..
ప్రగతి శీల యువజన సంఘం(పి వై ఎల్) జిల్లా ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ అన్నారు.మణుగూరు లో ఉన్న పవర్ ప్లాంట్ కారణంగా అందులో నుంచి వచ్చే విష వాయువు పొగ పీల్చుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని వారు అన్నారు కాళ్ల నొప్పులతో ఒళ్ళు నొప్పులతో విష జ్వరాలతో చర్ల మండలం లో ఉన్న ప్రతి కడపలో ఒకరికొక ఇద్దరికో జ్వరాలు ఉన్నాయి బాధపడుతున్నారు ఎన్నో రక్త పరీక్షలు చేసినా కూడా అది ఏంటి అనేది బయటికి రావడం లేదు చర్ల మండలానికి.. మణుగూరుకి మధ్యలో గోదావరి అడ్డు మణుగూరు లో ఉన్న పవర్ ప్లాంట్ కారణంగానే బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి మొత్తం తగ్గిపోతుంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చర్ల మండలం లో ఉన్న ప్రజలు మొత్తం చర్ల ప్రభుత్వాసుపత్రిలో అట్లాగే ప్రవేట్ ఆసుపత్రిలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మణుగూరు లో ఉన్న పవర్ ప్లాంట్ ని కొంతకాలం ఆపివేయాలని చర్ల మండలంలో ఉన్న ప్రజానీకాన్ని కాపాడాలని కాపాడాల్సివలిసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉందని ఆయన అన్నారు.చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బెడ్లు సరిపోక కిందనే కూర్చొని సెలెన్స్ పెట్టించుకుంటున్న పరిస్థితి ఉంది. సరైన సౌకార్యాలు కల్పించాలని కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో.. PYL మండల నాయకుడు.. చిరిగిడి నరేష్.. సీనియర్ జాన్సీ.. వనిత రాణి రవళి శ్రావణి కావ్య వల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన టెట్ ఎగ్జామ్స్ ఫీజులను వెంటనే తగ్గించాలి



.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ మాట్లాడుతూ
మార్చి 23. జరిగే భగత్ సింగ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా జరపాలని PYL జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ పిలుపునిచ్చారు
Mar 31 2024, 20:16
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.5k