చర్ల: భువనగిరి:చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడండి పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ డిమాండ్
చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడండి పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ డిమాండ్
చర్ల మండల కేంద్రంలో ఉన్న CHC ప్రభుత్వ ఆసుపత్రిని PYL కమిటీ సందర్శించడం జరిగింది నలుగురు MBBS డాక్టర్లు, 16 మంది స్టాఫ్ నర్స్ లు పనిచేయవలసిన ఆసుపత్రిలో, MBBS డాక్టర్ ఇద్దరు స్టాప్ నర్సులుఇద్దరు ట్రైనింగ్ తీసుకుంటున్న 8, మంది విద్యార్థులు అప్రెంటిస్ చేస్తున్న నర్స్ లను ప్రభుత్వాధికారులు పెట్టి చాకిరి చేపించుకుంటున్నారు. కనీసం వారికి బస్సుకు ఆటోకు వెళ్లడానికి చార్జీలు కూడా ఇవ్వడం లేదు కావున నిత్యవసర ధరలకు చార్జీలకు అనుకూలంగా అప్రెంటిస్ చేస్తున్న నర్సులకు ఎంతోకంతా వేతనాలు చెల్లించాలని.. ఇక్రూట్మెంట్లు సరిపడా బెడ్లు హాస్పిటల్ కి సరిపడా పరికరాలు లేకపోవడం కారణంగా చర్ల మండలంలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రగతి శీల యువజన సంఘం(పి వై ఎల్) జిల్లా ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ అన్నారు.మణుగూరు లో ఉన్న పవర్ ప్లాంట్ కారణంగా అందులో నుంచి వచ్చే విష వాయువు పొగ పీల్చుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని వారు అన్నారు కాళ్ల నొప్పులతో ఒళ్ళు నొప్పులతో విష జ్వరాలతో చర్ల మండలం లో ఉన్న ప్రతి కడపలో ఒకరికొక ఇద్దరికో జ్వరాలు ఉన్నాయి బాధపడుతున్నారు ఎన్నో రక్త పరీక్షలు చేసినా కూడా అది ఏంటి అనేది బయటికి రావడం లేదు చర్ల మండలానికి.. మణుగూరుకి మధ్యలో గోదావరి అడ్డు మణుగూరు లో ఉన్న పవర్ ప్లాంట్ కారణంగానే బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి మొత్తం తగ్గిపోతుంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చర్ల మండలం లో ఉన్న ప్రజలు మొత్తం చర్ల ప్రభుత్వాసుపత్రిలో అట్లాగే ప్రవేట్ ఆసుపత్రిలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మణుగూరు లో ఉన్న పవర్ ప్లాంట్ ని కొంతకాలం ఆపివేయాలని చర్ల మండలంలో ఉన్న ప్రజానీకాన్ని కాపాడాలని కాపాడాల్సివలిసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉందని ఆయన అన్నారు.చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బెడ్లు సరిపోక కిందనే కూర్చొని సెలెన్స్ పెట్టించుకుంటున్న పరిస్థితి ఉంది. సరైన సౌకార్యాలు కల్పించాలని కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో.. PYL మండల నాయకుడు.. చిరిగిడి నరేష్.. సీనియర్ జాన్సీ.. వనిత రాణి రవళి శ్రావణి కావ్య వల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
Mar 31 2024, 19:06