/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఆర్థిక సహాయం అందజేసిన గోలిగూడెం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు Vijay.S
ఆర్థిక సహాయం అందజేసిన గోలిగూడెం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల మదిరె గోలిగూడెం గ్రామానికి చెందిన బొడ్డు నరసింహా అనారోగ్యంతో మరణించారు. అతని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు బొడ్డు నరసింహ అంత్యక్రియల నిమిత్తం10,000/-

రూపాయలను ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గోలిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు, పులిగిల్ల గ్రామ శాఖ అధ్యక్షుడు బుగ్గ వెంకటేశం, బుగ్గ మనోజ్, బండారు మైసయ్య, కొంతం తిరుమల్ రెడ్డి, భోగ రమేష్, వేముల అమరేందర్, పర్వతం రాజు, పల్సం భాస్కర్, పల్లెర్ల స్వామి, పల్లెర్ల యాదగిరి, కళ్లెం జంగారెడ్డి, మంద రవి, వేముల అశోక్, తేర్యాల మల్లయ్య, రామోజీ, కంబాలపల్లి పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

వీధి కుక్కల దాడిలో జింక మృతి, అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ డిమాండ్


 

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అభయారణ్యం లో శనివారం వీధి కుక్కలు జింక పై దాడి చేసి చంపి తిన్న సంఘటన చాలా బాధాకరమైన సంఘటన అని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి నృసింహ అభయారణ్యం పేరుతో లక్షల రూపాయలు ఖర్చుచేసి వన్యమృగ సంరక్షణ కేంద్రంను రాయగిరి సమీపంలో ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. అధికారుల పర్యవేక్షణ, సెంట్రీ కాపలాతో వన్య ప్రాణులకు నిరంతరం రక్షణ కల్పించాలి. కానీ గత కొంత కాలంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా వన్య ప్రాణులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన అన్నారు. 

సెంట్రీ ల నిర్లక్ష్యం కారణంగానే ఊర కుక్కలు అభయారణ్యం లోకి ప్రవేశించి జింక ను వేటాడాయని ఆయన ఆరోపించారు. సెంట్రీ డ్యూటీ చేసే వారు అభయారణ్యం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను నిరంతరం పరిశీలించాలని, బయటి జంతువులు లోనికి రాకుండా, లోపటి జంతువులు బయటకు వెళ్ళకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. వేసవిలో వన్య ప్రాణులకు నీటి వసతి, నీడ వసతి, ఫెన్సింగ్ లాంటి సమస్యలు లేకుండా అధికారులు చూడాలని ఆయన డిమాండ్ చేశారు. వన్య ప్రాణి జింక మృతికి కారణమైన వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు.

మాందాపురంలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మాందాపురంలో ప్రవాస భారతీయులు సోలిపురం ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సోలిపురం వెంకట్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి ల సౌజన్యంతో నిర్మించిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామీ ఆలయంలో 16 వ్ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం వేదపండితులు ప్రబందపారాయణం, ద్వారతోరణ పూజలు, చతుస్నాణార్చన, హోమం, నివేదన, తీర్థ ప్రసాద వినియోగం మొదలగు పూజలు నిర్వహించి అనంతరం స్వామీ వారి కళ్యాణం వేద మంత్రోచ్చారణల మధ్య భక్తుల కనుల పండువగా తీరు కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని అమ్మవార్లను ఆసీనులను చేసి గ్రామంలోని వీదులలో రథోస్త్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాతలు సోలిపురం ప్రభాకర్ రెడ్డి,సోలి పురం వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ సోలిపురం సాగర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కుసంగి రాములు, బోయపల్లి యాదిరెడ్డి, సోలిపురం అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేట ఎంపీపీ గా బాధ్యతలు స్వీకరించిన నాగటి ఉపేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు - MPP గా  నీర్నేముల సిపిఎం ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ నియమితులయ్యారు ఈమెకు శనివారం మండల ప్రజా పరిషత్ కార్యంలో ఎంపీపీ గా బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఎంపిపి గా ఉన్న కన్నబోయిన జ్యోతి అనివార్యా కారణాలవల్ల రాజీనామా చేయడంతో ఎంపీపీ పదవికి ఖాలి ఏర్పడింది . దీంతో జడ్పీ సీఈఓ ఆదేశాలు మేరకు స్థానిక ఎంపీడీవో భూక్య యాకూబ్ నాయక్ ఇన్చార్జి ఎంపీపీగా నియమిస్తూ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నాగటి ఉపేందర్ మాట్లాడుతూ అధికారుల, ప్రజాప్రతినిధుల సహకారంతో మండల అభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు.

భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ మత్స్యగిరిగుట్టపై అర్చన చేయించిన నాయకులు


భువనగిరి ఎంపీగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవాలని కోరుతూ వలిగొండ మండల పరిధిలోని మత్స్యగిరి గుట్టపై అర్చన చేయించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతు సంఘం మాజీ అధ్యక్షులు బండారు నరసింహారెడ్డి మత్స్యగిరి గుట్ట మాజీ ధర్మకర్త కసర బోయిన లింగయ్య యాదవు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ రావడం హర్షించదగ్గ విషయం అన్నారు.

భారతదేశ సమగ్రత అభివృద్ధి పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు

మన దేశంలో ఉన్న ప్రాజెక్టులన్ని కట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది సమాచార హక్కు చట్టం పనికి ఆహార పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు

కథ పది సంవత్సరాల నుండి బిజెపి పాలనలో ప్రజలు విసిగిపోయారని నిరుద్యోగం పెరిగిందని ఉన్న పరిశ్రమలు మోసవేయడం తప్ప కొత్త పరిశ్రమలు రాలేదని అన్నారు మతాలను రెచ్చగొట్టి కోట్లు వేయించుకోవడం తప్ప అభివృద్ధి లేదని అన్నారు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వముగా ముద్ర పడిందని అన్నారు

తెలంగాణలో టిఆర్ఎస్ బిజెపి ఉనికి కోసం పనిచేస్తున్నాయని టిఆర్ఎస్ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అరూరు మాజీ సర్పంచ్ చెమ్మయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రఘుపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు మీసాల మత్స్యగిరి, పోలేపాక మహేష్ తదితరులు పాల్గొన్నారు.

పులిగిల్ల ప్రాథమిక పాఠశాలలో మద్యం సేవించిన ఆకతాయిలు... పైపులైన్ కనెక్షన్లు ధ్వంసం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 28.03.2024 గుడ్ ఫ్రైడే కారణంగా ప్రాథమిక పాఠశాల సెలవు కావడంతో గ్రామంలో కొంతమంది అల్లరి మూకలు కల్లు (మద్యం ) సేవించి,నీళ్ల మోర్టారు పైపు కనెక్షన్లు విరగట్టడం జరిగింది.ఈ మన పాఠశాల ఎందరికో ఉన్నత విద్యను,ఉన్నత స్థాయి కల్పించి బంగారు భవిష్యత్తు ఇచ్చిన,ఆధునిక దేవాలయం,రెండవ అమ్మఒడి లాంటి మన ప్రాథమిక పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటు, వారిని గుర్తించి హెచ్చరించగలరని, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పాఠశాల సెలవు రోజులలో ఎవరైనా గ్రౌండ్లో కనిపించినట్లయితే వెంటనే వారిని హెచ్చరించి తిరగనివ్వకుండా చూడగలరని గ్రామ పెద్దలను,గ్రామపంచాయతీవారినీ,ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయు బృందం వారు కోరుతున్నారు

పులిగిల్ల లో బొడ్డు నరసింహ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్


వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సిపిఎం నాయకులు బొడ్డు నరసింహ గారు అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సిపిఎం పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండీ జహంగీర్ గారు వారితో పాటు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, మాటూరు బాలరాజు, పులిగిల్ల మాజీ సర్పంచ్ కొమ్మిడి లక్ష్మారెడ్డి, దొడ్డి బిక్షపతి, వేముల చంద్రయ్య ,ఆనంద్, ముత్తయ్య అమరేందర్ ,యేసయ్య ,మారబోయిన ముత్యాలు, వేముల నాగరాజు, జ్యోతిబాసు తదితరులు పాల్గొన్నారు.

దుప్పల్లి గ్రామంలో కీసర స్వామి మృతి ,నివాళులర్పించిన సిపిఐ నాయకులు


వలిగొండ మండలంలోని దుప్పల్లి గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకులు కీసర్ స్వామి నిన్న సాయంత్రం మరణించినారు వలిగొండ సిపిఐ మండల సమితి వారి పార్థ దేహంపై జెండా కప్పి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఎలగందుల అంజయ్య మాట్లాడుతూ స్వామి చిన్ననాటి నుండి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ చివరి వరకు ఎర్రజెండా పార్టీని వదిలిపెట్టకుండా నిస్వార్ధమైన జీవితాన్ని గడిపి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ దుప్పల్లి గ్రామంలో ఎంతోమంది కమ్యూనిస్టు పార్టీ పోరాటకు పట్టిన కలిగిన వ్యక్తులు ఈ గ్రామంలో ఉన్నారు నేటి యువతరం కూడా వారి ఆదర్శాలను తీసుకుని యువత చైతన్య మార్గంలో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, సలిగంజి వీరస్వామి, ఎల్లంకి మహేష్,నరిగే యాదయ్య,కట్ల యాదగిరి,యాస జనార్దన్ రెడ్డి,సుద్దాల సాయికుమార్, కవేటి సుధాకర్,సలిగంజి కృష్ణ కుమార్,పలుసం సోమల్లు,నోముల నర్శయ్య,కన్నబోయిన పృథ్వీరాజ్, ఎర్ర కిరణ్,మామిడికాయల నరేష్, మునుగోటి చంద్రం, ఎర్ర నిఖిల్, అంతటి రాము,తదితరులు పాల్గొన్నారు.

సాయి యాదాద్రి సేవాశ్రమం నాలుగవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయండి: దెబ్బడి అశోక్ ప్రెసిడెంట్, జే వై శెట్టి సెక్రటరీ


 యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలోని వృద్ధాశ్రమం లో శనివారం జరిగే సాయి యాదాద్రి సేవాశ్రమం నాల్గవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని సేవాశ్రమం అధ్యక్షులు దెబ్బడి అశోక్, ప్రధాన కార్యదర్శి జే వై శెట్టి లు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి యాదాద్రి సేవాశ్రమం నాలుగు వసంతాలు పూర్తి చేసుకోని ఐదవ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా వారు దాతలకు , శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించి, నిరుపేదలైన విద్యార్థులకు చేయూత నందించి సేవలందిస్తున్నామన్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు భగవద్గీత పారాయణం, పదకొండు గంటలకు వికలాంగులకు నిత్యావసర వస్తువులు, ఔషదాలు, మరియు దుప్పట్ల పంపిణీ, మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎలక్ట్రానిక్, మరియు ప్రింట్ మీడియా మిత్రులకు ప్రమాద భీమా పత్రాలను పంపిణీ చేస్తామన్నారు. గ్రామ ప్రజలు, అభిమానులు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

రామన్నపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కన్నెబోయిన జ్యోతి


రామన్నపేట మండల ప్రజాపరిషత్ అద్యక్షురాలు కన్నెబోయిన జ్యోతి మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా . ఇట్టి రాజినామా పత్రమును జిల్లా పరిషత్ సి.ఇ.ఒ కి అందజేయడం జరిగింది. అట్టి రాజీనామాను ఆమె సానుకూలంగా స్పందించి ఆమోదించడం జరిగింది. ఇట్టి రాజీనామా కి కారణం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా నాలుగున్నర సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి.లింగయ్య సహకారంతో తన వంతు కృషిగా మండలంలో చాలా అభివృద్ధి పనులు చేయగా. మొన్న జరిగిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో అధికార పార్టీ ఎంపీటీసీలు తనపై దుష్ప్రచారం చెసి ఒక బీసీ మహిళ అని చూడకుండా తనను ఎగతాళి చేశారు. కొన్ని పార్టీల నాయకులకు మింగుడు పడక అధికార దాహంతో బిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలను అధికార పార్టీ వాళ్ళు . అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈ మూడు నెలల్లో ఒక పదవి కక్షతో తనను ఎన్నో విధాలుగా మహిళా అని చూడకుండా సర్వసభ్య సమావేశంలో అవహేళన చేశారు.

దానికి గాను ఆమె మానసిక ఆందోళన ఎన్నో ఇబ్బందులకు గురై రాజీనామా చేశారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన మండల ప్రజలకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి వెంట పాల్గొన్నవారు జనంపల్లి ఎంపిటిసి వేమవరపు సుధీర్ బాబు. సూరారం ఎంపీటీసీ దోమల సతీష్ యాదవ్. మునిపంపుల ఎంపిటిసి గాదె పారిజాత. రామన్నపేట ఎంపీటీసీ-1 గోరిగే నర్సింహ. తదితరులు పాల్గొన్నారు.