గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ఈ వేసవి నుంచి కూలి పెరగనుంది.వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త వేత నం అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వు లు జారీ చేసింది.
దీంతో రోజుకు రూ 272 అందుతున్న కూలి రూ.300 కు పెరగనుంది.ఈ నిర్ణయం తో మండలంలో 11,079 వేల మంది కూలీలకు లబ్ది చేకూరనుంది.అయితే కూలీలకు మూడేళ్ళుగా వేసవి భత్యం ఇవ్వకపోగా ఈసారి కూలి పెంపుతో సరిపెట్టారు.
ఉపాధిహామీ పథకం నిర్వ హణలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొ చ్చింది.ఇప్పటికే సాప్ట్ వేర్ ను పూర్తిగా తన ఆధీనం లోకి తీసుకుని పనిదినాల లక్ష్యాలు కేటాయింపులను పర్యవేక్షిస్తుంది.
పనులకు వచ్చే కూలీల సంఖ్య ఆధారంగా గ్రామం, మండలం, జిల్లా లక్ష్యాలను నిర్దేశిస్తుండగా రాష్ట్ర ప్రభు త్వం మరిన్ని పనిదినాలు పెంచేది.మూడేళ్ళుగా ఈ లక్ష్యాల మేరకు కూలీలకు పనులు కల్పిస్తున్నారు.
ఉపాధిహామీ పథకంలో మార్పు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏటా మాదిరిగానే 2024-25 ఆర్థిక సంవత్స రానికి కూలీల వేతనాలు పెంచుతూ నిర్ణయించిం ది.ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో రూ.28 కు పెంచింది.
గత సంవత్సరం రూ.15 మాత్రమే పెంచగా ఈసారి ఇంకాస్త ఎక్కువ పెంచగా కొత్త వేతనం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానుంది.
Mar 29 2024, 16:10