చివరిలో రెచ్చిపోయిన పరాగ్: పోరాడి ఓడిన ఢిల్లీ
ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిం చింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్,ఢిల్లీ ముందు 186 పరుగుల టార్గెట్ సేట్ చేసింది.
అయితే, చేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులే చేయగలి గింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ సొంత గ్రౌండ్‌లో ఢిల్లీపై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (49), ట్రిస్టన్ స్టబ్స్ 44 (నాటౌట్) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు. ఇక, మిచెల్ మార్ష్ (23),
రిషబ్ పంత్ (28) పర్వాలేదనిపించారు.
ఇక రాజస్థాన్ బౌలర్లలో నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు తీయగా.. అవేష్ ఖాన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. రాజస్థాన్ బ్యాటింగ్‌లో టాపార్డర్ పూర్తిగా విఫల మైనప్పటికీ.. మిడాలార్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్ (84) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
ఇక అశ్విన్ (29), ధృవ్ జురెల్ (20), హెట్మెయర్ (14) పరుగులతో పరువా లేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్ట్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఓక్కో వికెట్ దక్కించుకున్నారు...
Mar 29 2024, 14:37