బిజెపి నేత రాజాసింగ్ ను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
బిజెపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం చెంగిచెర్లకు వెళతానని ఆయన ప్రకటించారు.
అయితే అక్కడకు వెళ్లని చ్చేది లేదంటూ పోలీసులు అతనిని హౌస్ అరెస్ట్ చేశారు. హోలీ పండుగ నాడు చెంగిచెర్లలో హిందువులపై ముస్లిం వర్గం దాడి చేసింది.
ఈ దాడిలో గిరిజన మహిళ లు, యువకులు గాయపడ్డా రు. గాయపడ్డ వారిని పరా మర్శించేందుకు వెళ్తానని రాజాసింగ్ చెప్పడంతో పోలీ సులు అతనికి అనుమతివ్వలేదు.
ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తు న్నారని రాజాసింగ్ మండి పడ్డారు. దాడికి గురైన వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
చెంగిచెర్లకు వెళ్లి బాధితు లను పరామర్శిస్తామంటే పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని నిలదీశారు.హిందువులపై అకారణంగా దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు.
వారిపై పెట్టిన అక్రమ కేసు లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్లనీ యరా? అని నిలదీశారు. గాయపడిన మహిళలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామ న్నారు.







Mar 28 2024, 21:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.3k