Justice NV Ramana: రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
కృష్ణా జిల్లా: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి (Former Chief Justice) జస్టిస్ ఎన్వీ రమణ ( Justice NV Ramana)కు విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు (Chalasani Anjaneyulu), మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు (Dasari Balavardhana Rao), అమరావతి మహిళలు (Amaravati Womens), రైతులు (Farmers) ఘన స్వాగతం పలికారు..
ఈ సందర్భంగా మాజీ సీజేఐకు అమరావతి రైతులు, మహిళలు.. వినతిపత్రం అందజేశారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ అమరావతి మహిళా రైతులు తమ కష్టాలు చెప్పారని, ప్రస్తుత ప్రభుత్వ విధానాల వలన1563 రోజులు నుంచి ఉద్యమం చేస్తున్నామని రైతులు వెల్లడించారన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారని, రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను కూడా వచ్చానని చెప్పారు.
రైతుకు భూమికి ఉన్న సంబంధం తల్లి బిడ్డకు ఉన్న సంబంధం లాంటిదని, రైతు భూమి కోల్పోవడం సామాన్యమైన విషయం కాదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రైతులు భూములు ఇచ్చి నేరస్థుల్లా కోర్టులో నిలబడి అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వాలు మేల్కొని రైతులకు న్యాయం చేస్తారని అనుకుంటున్నానన్నారు. వాళ్లకు న్యాయ వ్యవస్థ కూడా పనిచేస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. ఆలస్యం అయినప్పటికీ తప్పక న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాని.. వారి ఉద్యమ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
Mar 28 2024, 18:52