చర్ల:భద్రాచలం:రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన టెట్ ఎగ్జామ్స్ ఫీజులను వెంటనే తగ్గించాలి:ప్రగతిశీల యువజన సంఘం( PYL )జిల్లా ఉపాధ్యక్షులు సతీష్
రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన టెట్ ఎగ్జామ్స్ ఫీజులను వెంటనే తగ్గించాలి
ప్రగతిశీల యువజన సంఘం( PYL )జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలని ప్రగతిశీల యువజన సంఘం PYL జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా ముసలి సతీష్ మాట్లాడుతూ.......తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగు లు గా ఉన్నారు .గతంలో టెట్, DSC కోసం ఎదురు చూసి చూసిన నిరుద్యోగుల కి నిరాశా మిగిలింది అని,గతంలో టెట్ పరీక్షలకు సంబంధించి పేపర్-1 కి ఫీజు రూ. 200 , పేపర్-2 కి రూ. 200 మొత్తం కలిపి 400 రూపాయలు మాత్రమే ఉండేవి. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫీజులను రెండు పేపర్ లకి కలిపి 1600 రూపాయలు భారీగా పెంచారు. ఇది టెట్ అభ్యర్థులకు, నిరుద్యోగులకు ఇది ఆర్ధికంగా భారం అవుతుంది అని, అసలే BRS ప్రభుత్వం లో నిరుద్యోగులు అనేక రకాలుగా బాధపడి ఉన్నారని, రాష్ట్రము లో రోజు రోజుకి నిరుద్యోగ సమస్య ఎక్కువైంది అని, అందుకే BRS ప్రభుత్వం ని నిరుద్యోగులే ఓడించి కాంగ్రెస్ ని గెలిపిస్తే, అధికంగా ఫీజుల వసులు చేస్తుంది అని.హైదరాబాద్ లో వెలకి వేలు కోచింగ్ సెంటర్ లో ఫిజు లు కట్టి ఉద్యోగం రాక కూలి చేసుకొని, స్వయం ఉపాధి పొందుతూన్నారని, అలాంటి పేద నిరుద్యోగుల పై ప్రభుత్వం దయ చూపాలని ప్రభుత్వం ని కోరినారు.దీని వలన రాష్ట్రంలోని అభ్యర్థులకు ఆర్థికంగా భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పేద , మధ్య తరగతి అభ్యర్థులు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది . కాబట్టి తెలంగాణ లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పేద , బడుగు బలహీన వర్గాల అభ్యర్థులు ఆర్థికంగా నష్టం జరగకుండా భారీగా పెంచిన టెట్ పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించి ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రగతిశీల ప్రగతిశీల యువజన సంఘం ( PYL ) గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల అభ్యర్థులను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని , దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
Mar 28 2024, 17:36