టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్
టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు..
ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిల ప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు సైతం భారీగా తరలివెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అఖిలప్రియను, టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అఖిలప్రియను పోలీసులు అదులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. వినతిపత్రిం ఇచ్చేందు వస్తే అరెస్ట్ చేయడమేంటని తెలుగు తమ్ముళ్లు పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎంవో స్పందించలేదని తెలిపారు. అందుకే నేరుగా సీఎంను కలిసి వినతి పత్రం ఇద్దామని వచ్చానన్నారు. వినతిపత్రం ఇస్తే శాంతిభద్రతల సమస్య ఎలా అవుతోందని ప్రశ్నించారు..
Mar 28 2024, 12:58