గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం వర్ధంతి
చట్టసభలలో పట్టుబట్టి ప్రజా సంఘాల హక్కులను సాధించిన ప్రజల మనిషి, స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ బొమ్మ గానిధర్మబిక్షం
దేశ, రాష్ట్ర చట్టసభలలో తన గల మెత్తి, పట్టుబట్టి
ప్రజా సంఘాల హక్కులను సాధించినమహాయోధుడైన స్వర్గీయ కామ్రేడ్ బొమ్మ గాని ధర్మ బిక్షం గారి 13వ వర్ధంతి సందర్భంగా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామం పరిధిలోని తాటి వనంలో సిపిఐ పార్టీ గీతా పనివారల సంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు శాంతి కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ ధర్మాభిక్షం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడని పేర్కొన్నారు.
1957 వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా పరిధిలోని గార్ల గ్రామంలో గీత పనివాళ్ల సంఘాన్ని స్థాపించాడని, అనంతరం ప్రతి గ్రామంలో గీత పని వారల సంఘాలను ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు.
1952 వ సంవత్సరంలో ఉమ్మడి జిల్లా లోని సూర్యాపేట ఎమ్మెల్యేగా,
1957 నో నకిరేకల్ ఎమ్మెల్యేగా, 1963 లో నల్లగొండ ఎమ్మెల్యేగా ధర్మ బిక్షం గెలుపొందడం జరిగిందని, అలాగే/1990--92 సంవత్సరాలలో రెండుసార్లు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ నుండి విజయం సాధించాడని ఆయన తెలిపారు.
ప్రజా ప్రతినిధిగా చట్టసభలలో ప్రజా సంఘాల హక్కులకై తన గలమెత్తి, పట్టుబట్టి హక్కులను సాధించిన మహాయోధుడని కొనియాడారు.
గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి మృతి చెందిన కుటుంబాలకు ధర్మ బిక్షం ప్రభుత్వాలతో పోరాడి ఎక్స్గ్రేషన్ మంజూరు చేయించిన ఘనుడన్నారు.
ఈ ఎక్స్గ్రేషియా తొలుత
10వేల రూపాయలు ఉండగా అంచేలంచలుగా
2 లక్షల రూపాయల వరకు చేయించాడని, అలాగే 50 సంవత్సరాలు నిండిన ప్రతిగీత కార్మికునికి200
రూపాయలు పెన్షన్ మంజూరు చేయించిన మహానుభావుడ నీ ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రతి గ్రామానికి తాటి ,ఈత చెట్లు పెంపొందించుకునేందు కై
ప్రభుత్వాలతో పోరాడి 5 ఎకరాల భూమిని కేటాయించాలని పట్టుబట్టి 560 జీవోను సాధించిన ఘనుడు ధర్మ బిక్షమని పేర్కొన్నారు.
తన జీవితాన్ని ఉద్యమాలకు, పోరాటాలకు, ప్రజా హక్కుల సాధనకై గడిపిన ధర్మభిక్షం ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిమ్మల అంజయ్య గౌడ్, చిలుకూరి లక్ష్మయ్య గౌడ్, జలంధర్, సైదులు, వెంకట్ నర్సు, కుమ్మరి మల్లయ్య, బోడ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
Mar 27 2024, 17:27