/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం వర్ధంతి Vijay.S
గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం వర్ధంతి


చట్టసభలలో పట్టుబట్టి ప్రజా సంఘాల హక్కులను సాధించిన ప్రజల మనిషి, స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ బొమ్మ గానిధర్మబిక్షం 

దేశ, రాష్ట్ర చట్టసభలలో తన గల మెత్తి, పట్టుబట్టి

ప్రజా సంఘాల హక్కులను సాధించినమహాయోధుడైన స్వర్గీయ కామ్రేడ్ బొమ్మ గాని ధర్మ బిక్షం గారి 13వ వర్ధంతి సందర్భంగా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామం పరిధిలోని తాటి వనంలో సిపిఐ పార్టీ గీతా పనివారల సంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు శాంతి కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ ధర్మాభిక్షం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడని పేర్కొన్నారు.

1957 వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా పరిధిలోని గార్ల గ్రామంలో గీత పనివాళ్ల సంఘాన్ని స్థాపించాడని, అనంతరం ప్రతి గ్రామంలో గీత పని వారల సంఘాలను ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు.

1952 వ సంవత్సరంలో ఉమ్మడి జిల్లా లోని సూర్యాపేట ఎమ్మెల్యేగా,

1957 నో నకిరేకల్ ఎమ్మెల్యేగా, 1963 లో నల్లగొండ ఎమ్మెల్యేగా ధర్మ బిక్షం గెలుపొందడం జరిగిందని, అలాగే/1990--92 సంవత్సరాలలో రెండుసార్లు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ నుండి విజయం సాధించాడని ఆయన తెలిపారు.

ప్రజా ప్రతినిధిగా చట్టసభలలో ప్రజా సంఘాల హక్కులకై తన గలమెత్తి, పట్టుబట్టి హక్కులను సాధించిన మహాయోధుడని కొనియాడారు.

గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి మృతి చెందిన కుటుంబాలకు ధర్మ బిక్షం ప్రభుత్వాలతో పోరాడి ఎక్స్గ్రేషన్ మంజూరు చేయించిన ఘనుడన్నారు.

ఈ ఎక్స్గ్రేషియా తొలుత 

10వేల రూపాయలు ఉండగా అంచేలంచలుగా

2 లక్షల రూపాయల వరకు చేయించాడని, అలాగే 50 సంవత్సరాలు నిండిన ప్రతిగీత కార్మికునికి200

రూపాయలు పెన్షన్ మంజూరు చేయించిన మహానుభావుడ నీ ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ప్రతి గ్రామానికి తాటి ,ఈత చెట్లు పెంపొందించుకునేందు కై

ప్రభుత్వాలతో పోరాడి 5 ఎకరాల భూమిని కేటాయించాలని పట్టుబట్టి 560 జీవోను సాధించిన ఘనుడు ధర్మ బిక్షమని పేర్కొన్నారు.

తన జీవితాన్ని ఉద్యమాలకు, పోరాటాలకు, ప్రజా హక్కుల సాధనకై గడిపిన ధర్మభిక్షం ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిమ్మల అంజయ్య గౌడ్, చిలుకూరి లక్ష్మయ్య గౌడ్, జలంధర్, సైదులు, వెంకట్ నర్సు, కుమ్మరి మల్లయ్య, బోడ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి


బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రియదర్శిని మేడి ని మంగళవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో బెహెన్ జీ కుమారి మాయావతి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నియమించారు. తెలంగాణ చీఫ్ గా ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రాజీనామా నేపథ్యంలో పార్టీ పట్ల విధేయత కలిగిన వారికి, రాజీ పడని వారికి అవకాశమిస్తే బహుజన వాదం గెలుస్తుందన్న ఆలోచనతోనే ఈ నియామకం జరిగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి నకిరేకల్ నియోజకవర్గంలో గడపగడపకు ఏనుగు గుర్తును ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లామన్నారు.బహుజనుల కోసం కొట్లాడే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అన్నారు. బహుజనులంతా ఏకతాటిపై వచ్చి అన్ని రంగాల్లో తమ వాటా సాధించుకోవాలన్నారు. తనకు రాష్ట్ర కమిటీ లో చోటు కల్పించిన నేషనల్ కో ఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతం , రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మరియు నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

భువనగిరి భాజపా పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో రజాకార్ సినిమా ప్రదర్శన


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ని శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్ లో గూడూరు నారాయణరెడ్డి నిర్మాత గా యాట సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మించిన రజాకార్ సినిమాను మంగళవారం, బుధవారం రోజులలో ఈ సినిమాని రెండు షోలు భారతీయ జనతాపార్టీ సినియర్ నాయకులు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో రజాకార్ సినిమాను రెండు రోజులు ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.

వలిగొండ మండల ప్రజలు నాయకులు బిజెపి పార్టీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వలిగొండ సినిమా థియేటర్ కు వచ్చి రజాకార్ సినిమాలు తిలకించి ఆనాడు రజాకారుల నాయకుడు కాశీం రజ్వి చేసిన అరాచకాలను కళ్లకు కట్టినట్టుగా చూపించిన రజాకార్ సినిమా దర్శకులు యాట సత్యనారాయణకు నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన మండలం భాజపా నాయకులు ఎన్నో వ్యయ ప్రయాసలను భరించి ఈ రజాకార్ సినిమా నిర్మించినందుకుగాను వారికి వారి సినిమా యూనిట్ కు ధన్యవాదములు తెలుపవలసిందిగా కోరడం జరిగినది. ఈ సినిమా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఇతరులకు చూసే విధంగా ప్రోత్సహించాలని కోరడం జరుగుతుంది. మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ బచ్చు శ్రీనివాస్ గుప్తా, భాజపా కిసాన్ మోర్చా మండల శాఖ అధ్యక్షులు కొత్త రామచందర్ యాదవ్, సీనియర్ నాయకులు దంతూరి సత్తయ్య, గౌడ్ సీలోజు శ్రీరాములు, బందారపు రాములు, రాచకొండ కృష్ణ, బాసవాడ బిక్షపతి, మంద నరసింహ, తదితర నాయకులు మండల ప్రజలకు రజాకార్ సినిమాను తిలకించవలసిందిగా కోరడం జరుగుతుంది.

ప్రజా పాలనకు వంద రోజులు ప్రజా నాయకుడికి 100 ప్రశ్నలు లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ప్రజా పాలనకు వంద రోజులు ప్రజా నయకుడికి 100 ప్రశ్నలు కార్యక్రమంలో భాగంగా భువనగిరి పరిధిలోని దీప్తి హోటల్ నందు మంగళవారం రెండు గంటలకు ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజుల్లో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని ఇప్పటికే 118 గ్రామాల్లో పర్యటించి అండర్ పాస్ ను సాంక్షన్ చేశామని అన్నారు. యాదాద్రి ని యాదగిరిగుట్ట గా పేరు మార్చామని కొండపైకి ఆటోల కు అనుమతి కల్పించి 300 కార్మికుల సమస్యలను తీర్చామని అన్నారు. కొండపైన భక్తులు నిద్రించే సౌకర్యం కల్పించడం జరిగిందని మరియు కొబ్బరికాయలు కొట్టే స్థలం ఏర్పాటు చేశామని అన్నారు.

దాసిరెడ్డి గూడెంలో మాజీ మావోయిస్టు సాంబశివుడి 13వ వర్ధంతి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో. ఉద్యమాల యుద్ధభేరి. సాంబశివుడు 13వ వర్ధంతిని.

 ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు స్వర్ణలత కూతురు అల్లుడు అనిల్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం అడవిని వదిలి, ప్రజలకు సేవ చేసే క్రమంలో ఓర్వ లేక హత్య చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నారి మల్లేష్ ,నారి నరసింహ, నారి శ్రీశైలం, నారి బాలకృష్ణ ,సాయికుమార్ మరియు మండల టిఆర్ఎస్ నాయకులు తుమ్మల వెంకటరెడ్డి. కొమిరెల్లి సంజీవరెడ్డి. పడమటి మమత నరేందర్ రెడ్డి. డేగల పాండు. మాద శంకర్ లావణ్య. దామోదర్ రెడ్డి. పాల్గొని ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులు అర్పించారు.

చిత్తాపురం స్టేజి వద్ద స్కూటీని ఢీ కొట్టిన కారు పలువురికి గాయాలు కేసు నమోదు చేసిన వలిగొండ ఎస్సై మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాలడుగు గ్రామానికి చెందిన యాస బిక్షం రెడ్డి తన కూతురి వివాహ పత్రికలు తీసుకుని చిత్తాపురం లో ఇచ్చి తిరుగు ప్రయాణంలో స్కూటీ పై చిత్తాపురం స్టేజి వద్దకు రాగానే అతివేగంగా, జాగ్రత్తగా వచ్చిన కారు ఢీకొట్టడంతో బిక్షం రెడ్డి తలకి, చేతులకి, కాళ్ళకి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుండి మెరుగైన చికిత్స కోసం నల్గొండ లోని ఐకాన్ హాస్పిటల్ కి తరలించారు . కారులో ప్రయాణిస్తున్న పోలంగరి శ్రీనివాస్ రెడ్డి, పద్మావతి, బాలకృష్ణ రెడ్డి, సంధ్య లకు కూడా గాయాలయ్యాయి. కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యాస బిక్షం రెడ్డి అల్లుడు బొక్క సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులుగా బచ్చు శ్రీనివాస్ గుప్త నియామకం


 

భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల కేంద్రంకు చెందిన బచ్చు శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు గా ఎంపిక కావడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అద్యక్షులు పాశం భాస్కర్ నియామక పత్రం ను వారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన వలిగొండ మండల అద్యక్షులు బోల్ల సుదర్శన్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు CN రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా,పార్లమెంట్ కన్వినర్ బందారపు లింగ స్వామి గౌడ్ , స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్ర శేఖర్, జిల్లా సెక్రటరీ కొప్పుల యాదిరెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య గౌడ్ సీనియర్ నాయకులందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానని గ్రామాల్లో పార్టీ పటిష్టతకు పని చేస్తానని,పార్టీ పిలుపు మేరకు పని చేస్తానని వారు అన్నారు.

తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

   

  తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్ల కన్వీనర్ కాశాపాక మహేశ్ అధ్యక్షతన జరిగిన # రౌండ్ టేబుల్ సమావేశం # ఫాసిస్టు న‌రేంద్ర మోదీని ఓడించండి,రాజ్యాంగ‌, ప్ర‌జాస్వామిక విలువ‌ల‌ను ప‌రిర‌క్షించండన్ని పిలుపు ఇచ్చారు.       ఈ కార్యక్రమం లో CPM జిల్ల కార్యదర్శి MD జాంగిర్. బట్టు రామచంద్రయ్య. R. జనార్దన్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి. ఉప్పలయ్య CPIML జిల్ల కార్యదర్శి. సుదర్శనాయర్ క్రిస్టియన్ ఫాస్టర్. అమిద్ పాషా. కట్టెల లింగస్వామి టీచర్. Asgar అలీ CAF కన్వీనర్. S. మల్లారెడ్డి సీనియర్ పాత్రికేయులు. M. సతయ్య DTF జిల్ల అధ్యక్షులు.. బోయ నర్సింహ్మ. కావలి యాదయ్య. రసాల బాలస్వామి.G.బాలకృష్ణ.  డిటిఎఫ్ సత్తయ్య . తదితరులు పాల్గొని మాట్లాడారు.

ప్రియ‌మైన ప్ర‌జ‌లారా..! ప్ర‌జాస్వామిక వాదులారా..!!

రెండు నెల‌ల్లో దేశంలో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రుగ‌బోతున్నాయి. ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ పార్టీల‌న్నీ క‌ల్లబొల్లి మాట‌ల‌తో స‌రికొత్త హామీల‌తో ముస్తాబై ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్నాయి. మసిబూసి మారెడుగాయ చేసి ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు వాగ్దానాల్లో పోటీ ప‌డుతున్నాయి. అంద‌మైన అబ‌ద్దాల‌తో, అంతుపొంతూ లేని హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు పోటీ ప‌డుతున్నాయి. ఓట‌ర్ల‌ను ఏ విధంగానైనా ప్ర‌స‌న్నం చేసుకొని ఓట్లు దండుకొని గ‌ద్దెనెక్కేందుకు ఆరాట‌ప‌డుతున్నాయి. ధ‌న బ‌లం, కండ‌బ‌లం, కుల బ‌లం ఆస‌రా చేసుకొని ఓట‌ర్ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకొనేందుకు కుట్ర‌లు కుహ‌కాల‌కు పాల్ప‌డుతున్నాయి. ఇలాంటి ట‌క్కు ట‌మార గార‌డి విద్య‌ల్లో బీజేపీ మొద‌లు కాంగ్రెస్, ఇత‌ర విప‌క్ష పార్టీలు, రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ దాకా అన్ని పార్ల‌మెంట‌రీ రాజ‌కీయ పార్టీలు ఒకదానికి మించి మ‌రొక‌టి పోటీ ప‌డుతున్నాయి. అన్ని పార్టీల ల‌క్ష్యం ఒక్క‌టే.., ఓట్ల‌ను దండుకొని అధికారాన్ని కైవ‌సం చేసుకోవ‌టం. దీనికోసం పార్టీల‌న్నీ ఎంత‌కైనా తెగిస్తున్నాయి. ఎంత‌టి నైచ్యానికైనా దిగ‌జారుతున్నాయి. 

అయితే.. అధికారం కోసం, ఓట్లు దండుకోవ‌టం కోసం చేసే కుట్ర‌లు, కుహ‌కాల్లో న‌రేంద్ర‌మోదీ నేతృత్వం లోని బీజేపీ మ‌రో ఆకు ఎక్కువ చ‌దివింది. మెజారిటీ వాదంతో స‌మాజంలో విభ‌జ‌న రేఖ‌లు గీసి మ‌త ఉద్రిక్త‌త‌ల‌ను పెంచి పోషిస్తున్న‌ది. మ‌తాన్ని రాజ‌కీయంతో జోడించి మ‌త‌రాజ‌కీయం చేస్తున్న‌ది. ఓట్ల కోసం మ‌త విశ్వాసాల‌ను, సున్నిత సంస్కృతిక అంశాల‌ను వాడుకుంటున్న‌ది. మ‌త క‌ల‌హాల‌ను రేపుతూ శ‌వాల గుట్ట‌ల‌పై ఓట్ల‌ను ఏరుకొంటున్న‌ది. 80వ‌ ద‌శ‌కంలో రెండు సీట్ల‌కే ప‌రిమిత‌మైన బీజేపీ నేడు అధికా రం చేజిక్కించు కునేంత‌గా సంఖ్యాబ‌లం పెంచుకోవ‌టంలో ఆర్ఎస్ఎస్ సంఘ్‌ప‌రివార్ శ‌క్తులు, మోదీ నాయ‌క‌త్వంలోని బీజేపీ రేపిన మ‌త‌క‌ల‌హాలు, పారించిన నెత్తురు అంతా ఇంతా కాదు. అయోధ్య‌ ర‌థ‌యాత్ర నుంచి గుజ‌రాత్ మార‌ణ‌కాండ దాకా దేశాన్ని మ‌రుభూమిగా మార్చి స‌మాజంలో ర‌క్త‌పుటేరులు పారించి అధికారపీఠాన్ని చేజిక్కించుకున్న‌ది. 

గుజ‌రాత్ మార‌ణ‌కాండ శ‌వాల‌గుట్ట‌ల‌పై 2014లో అధికారం చేజిక్కించుకున్న మోదీ... ముచ్చ‌ట‌గా మూడో సారి అధికారాన్ని కైవ‌సం చేసుకోవ‌టం కోసం నానా తంటాలు ప‌డుతున్నాడు. సాధార‌ణ ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్ర‌జ‌ల్లో సెంటిమెంటును రాజేసి, మ‌త ఉద్రిక్త‌త‌ల‌ను పెంచి మెజారిటీ ఓట్ల‌ను కొల్ల‌గొట్టే ప‌నిని ఒక క‌ళగా అభివృద్ధి చేసిన మోదీ ఇప్పుడు స‌రికొత్త అస్త్రాల‌ను బ‌య‌ట‌కు తీస్తున్నాడు. మొద‌టి ద‌ఫా అయోధ్య రామాలయాన్ని, మ‌త విభ‌జ‌న‌ను వాడుకుంటే; రెండో ద‌ఫాలో స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌లు, పుల్వామా దాడుల‌ను వాడుకొని ఓట్లు దండుకున్నాడు. ఇప్పుడు తాజా ఎన్నిక‌ల కోసం అయోధ్య‌లో రామాల‌యం క‌ట్టించాన‌నీ, వార‌ణాసిలో జ్ఞ‌న‌వాపీ మ‌సీదును కూల్చి ఆల‌యాన్ని నిర్మిస్తాన‌నీ, మ‌ధుర‌లో శ్రీ‌కృష్ణ మందిరం నిర్మిస్తాన‌ని చెప్తూ మెజారిటీ ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు కుట్ర‌లు కుహ‌కాలు ప‌న్నుతున్నాడు. 

అధికారం చేప‌ట్టిన నాటి నుంచీ ఒకే దేశం ఒకే ప్ర‌జ నినాదం ఎత్తుకున్న మోదీ సీఏఏ, ఎన్ఆర్‌సీ లాంటి చ‌ట్టాల‌తో ప్ర‌జ‌ల పౌర‌స‌త్వ హ‌క్కునే కాల‌రాస్తున్నాడు. ఒక్క క‌లం పోటుతో ల‌క్ష‌లాది మంది పౌర‌స‌త్వ హ‌క్కును ర‌ద్దుచేసి రాత్రికిరాత్రి ల‌క్ష‌లాది మందిని కాందిశీకుల‌ను చేశాడు. జ‌మ్ము క‌శ్మీర్ ప్ర‌త్యేక ఉనికికి ర‌క్ష‌ణ‌గా ఉన్న 370 ఆర్టిక‌ల్ ను ర‌ద్దు చేసి, కశ్మీర్‌ను మూడు ముక్క‌లుగా విడ‌గొట్టి అంద‌మైన క‌శ్మీర్‌ను అంబానీ, ఆదానీల‌కు అప్ప‌గిస్తున్నాడు. రాజ్యాంగాన్నే మార్చేసి త‌మ‌దైన మ‌నువాద వ‌ర్ణాశ్ర‌మ ధ‌ర్మాల ను (విలువ‌ల‌ను) అమ‌లు చేసేందుకు పావులు క‌దుపుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శించిన మేధావులు, ర‌చ‌యిత‌ల‌పై క‌క్ష‌గ‌ట్టి దాడులు, హ‌త్య‌ల‌కు గురిచేస్తున్న‌ది మోదీ ప్ర‌భుత్వం. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేశ్‌, హేతువాద ర‌చ‌యిత‌, కార్మిక నేత గోవింద్ ప‌న్సారే, క‌ల‌బుర్గి లాంటి ఎంద‌రో మేధావుల‌ను సంఘ్‌ప‌రివార్ శ‌క్తులు హ‌త్య‌చేశాయి. ప్ర‌జా ఉద్య‌మాల‌కు మ‌ద్ద‌తు గా నిలిచి ఆదివాసీల హ‌క్కుల కోసం పోరాడుతున్న వారిపై కుట్ర‌కేసులు పెట్టి జైలు నిర్బంధాల‌కు గురిచే సింది బీజేపీ ప్ర‌భుత్వం. తెలంగాణ నుంచి ప్ర‌ఫెస‌ర్ సాయిబాబ‌, విప్ల‌వ క‌వి వ‌ర‌వ‌ర‌రావుల‌ను ఏండ్ల త‌ర‌బ‌డి జైలు పాలు చేసింది. త‌మ మ‌త‌రాజ‌కీయాల‌ను విమర్శిస్తున్న వారిని దేశ వ్య‌తిరేకులుగా చిత్రీక‌రిస్తూ తీవ్ర నిర్బంధాల‌కు గురిచేస్తున్నది. మొత్తంగా మెజారిటీ వాద రాజ‌కీయంతో మెజారిటీ స‌మ్మ‌తిని కూడ‌గ‌ట్టి ఫాసిస్టు పాల‌న దిశ‌గా మోదీ దేశాన్ని తీసుకుపోతున్నాడు.

- తెలంగాణ ప్ర‌జాఫ్రంట్‌, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా

వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిగాస్తుల గుర్తింపు సర్వే


కుష్ఠు వ్యాధి నివారణ కొరకు, కుష్ఠు వ్యాధిగ్రస్తులు గుర్తింపు లో భాగంగా ఇంటి ఇంటి సర్వే నిర్వహించారు. శనివారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వేములకొండ వైద్య సిబ్బంది, హై రిస్క్ ఏరియాలు ,దుప్ప్పల్లి గ్రామ క్రాస్ రోడ్ వద్ద ఉన్న రైస్ మిల్లోని హమాలీ కార్మికులకు మరియు వెములకొండ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఇటుక బట్టి కార్మికులకు ,అరుర్ గ్రామం వద్ద గల కోళ్ల పరిశ్రమ లోని కార్మికులకు,వారి చర్మం పై ఉన్న మచ్చలను పరిశీలించి ,కుష్ఠు వ్యాధి లక్షణాలపై వారికి అవగాహన కల్పించటం జరిగినది. ఈ కార్యక్రమంలో నోడల్ పర్సన్ జే సత్తయ్య ,ఆరోగ్య కార్యకర్తలు కె శోభారాణి, జే వినోద, ఎన్ అనిత , ఏ వెంకటేష్,అషా కార్యకర్తలు వి రాణి, ఎం సంతోష, ఎన్ సుజాత, జీ రామలీల ,మిల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు

శ్రీ చైతన్య విద్యాలయం చైర్మన్ తాడూరు చంద్రయ్య మృతి, నివాళులర్పించిన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శనివారం గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ విద్యావేత్త ప్రవేట్ స్కూల్ ల రాష్ట్ర నాయకులు శ్రీ చైతన్య విద్యాలయం చైర్మెన్ తాడూరు చంద్రయ్య గారి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి.పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మెరుగు మధు,టాస్మా అసోసియేట్ ప్రెసిడెంట్ పాలకూర్ల వెంకటేశం, కాసుల వెంకటేశం, గుర్నాథ్ పెళ్లి మల్లేశం, మల్ల వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు