టెట్ పరీక్ష కు నార్మలైజేషన్ ఉందా? లేదా? అభ్యర్థుల్లో గందరగోళం
ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు నిర్వహించే టీచర్ ఎలిజిబి లిటీ టెస్ట్ టెట్, పలు వివా దాలకు కేంద్రంగా మారుతు న్నది...
ఇప్పటికే ఫీజుల పెంపుతో అభ్యర్థుల నడ్డివిరిచిన సర్కారు.. నోటిఫికేషన్‌లో నార్మలైజేషన్‌పై స్పష్టత ఇవ్వకపోవడం మరో వివాదానికి కారణమైంది. టెట్‌లో నార్మలైజేషన్ ఉంటుందా? ఉండదా? అనే సందేహాలు అభ్యర్థులను పట్టిపీడిస్తున్నాయి.
టెట్ నోటిఫికేషన్‌లో నార్మ లైజేషన్‌పై విద్యాశాఖ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. టెట్‌ను తొలిసారిగా కంప్యూ టర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ,విధా నంలో నిర్వహించబోతు న్నారు.
మే 20 నుంచి జూన్ 3 వరకు 15 రోజులపాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో సెషన్‌లో 30 -35 వేల మందికి మాత్రమే పరీక్షను నిర్వహించే వీలుంది. ఒకే సబ్జెక్టుకు రెండు, మూడు సెషన్లల్లో పరీక్షలు నిర్వహిం చే అవకాశముంది.
ఒక పేపర్ ఈజీగా..లేదా మధ్యస్తంగా.. మరో పేపర్ కఠినంగా వస్తే ఆయా సెషన్‌లో పరీక్షకు హాజరైన వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.సులభంగా ప్రశ్నలొచ్చిన వారికి లాభం జరగగా, కఠినంగా వచ్చినవారికి నష్టం కలిగే అవకాశమున్నది.
ఇంతటి కీలకమైన విష యంపై విద్యాశాఖ స్పష్ట తనివ్వకపోగా, ఈ విషయా న్ని పూర్తిగా విస్మరించడం గమనార్హం. గతంలో టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించడం వల్ల అభ్యర్థులందరికీ ఒకే ప్రశ్నపత్రాన్నిచ్చేవారు.
పేపర్ల మూల్యాకంనంలో ఇబ్బందులొచ్చేవి కాదు. కానీప్పుడు ఆన్‌లైన్‌లో నిర్వహించడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి. దీనిపై విద్యా శాఖకు చెందిన ఓ ఉన్నతా ధికారిని సంప్రదించగా.. ఇప్పటి వరకు నార్మలైజే షన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
అన్నింటా అమలు..
ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీ క్షలన్నింటిలోనూ నార్మలైజే షన్ విధానం అమవుతు న్నది. మరి ఇలాంటప్పుడు టెట్‌కెందుకు లేదన్న ప్రశ్నలు అభ్యర్థుల నుంచి వినిపిస్తు న్నాయి.
జాతీయంగా నిర్వహించే జేఈఈ మొదలుకొని.. టీఎస్‌పీఎస్సీ, గురుకుల నియామక పరీక్షలన్నింటిలో నార్మలైజేషన్‌ను అమలు చేస్తున్నారు.
Mar 24 2024, 09:24