భువనగిరి పార్లమెంట్ లో పోటీ చేస్తున్న సిపిఎం ను గెలిపించండి: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ పిలుపు
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సిపిఎంను గెలిపించి మతోన్మాద బిజెపిని ఓడించాలని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి, సిపిఎం జిల్లా కార్యదర్శి యండి.జహంగీర్ పిలుపు నిచ్చినారు. శనివారం సుందరయ్య భవన్, భువనగిరిలో సిపిఎం భువనగిరి మండల జనరల్ బాడీ సమావేశం మండల కార్యదర్శివర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య అద్యక్షతన జరుగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యండి. జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ
కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడి ప్రభుత్వం దేశసంపదను మొత్తం అధానీ అంభాని లాంటి కార్పొరేట్ శక్తులకు, దోపిడీ దారులకు దోచిపెడుతున్నారనీ విమర్శించారు. మరోప్రక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రవేట్ పరంచెస్తు కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్ముతున్నార అన్నారు. మరో పక్క ప్రజలపై అనేక భారాలను మోపుతూ ధరలు పెంచి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని అన్నారు. పది సంవత్సరాల బిజెపి పాలనలో మతఘర్షనలు సృష్టిస్తుా, విభజన రాజకీయాలు చేస్తు భారత రాజ్యాంగాన్ని, ప్రజలకు హక్కులను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి చిత్తుచిత్తుగా ఓడించాలని జహంగీర్ పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న యండి.జహంగీర్ గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరినారు. జహంగీర్ గారు గత 35 సంవత్సరాలు ఎర్రజెండా చేతబట్టి కార్మికుల కర్షకుల వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం, తాగు సాగునీటి సమస్యల పరిష్కారం కోసం, యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్రాభివృద్ధికి కోసం అనేక పోరాటాలతో పాటు పాదయాత్రలు కూడా చేసి ప్రజల పక్షాన నిలిచిన గొప్ప చరిత్ర కలిగిన నాయకుడని అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్నదని ఈ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే, ప్రజల బాధలు పోవాలంటే ప్రజల పక్షాన నిలబడే ప్రజా నాయకుడు జహంగీర్ గారి సుత్తి కొడవలి సుక్క గుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని నర్సింహ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపల్లి ముత్యాలు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ , మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, పాండాల మైసయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, ఎల్లంల వెంకటేష్ , మోటే ఎల్లయ్య, వివిధ గ్రామాలకు సంబంధించిన శాఖ కార్యదర్శులు నరాల చంద్రయ్య, కూకుట్ల కృష్ణ , బోడ ఆంజనేయులు, కళ్లెం లక్ష్మీనరసయ్య తోపాటు యండి.జహంగీర్, కడారి కృష్ణ , మద్యపురం బాల్ నర్సింహ్మ, మచ్చ భాస్కర్, ఉడుత విష్ణు, కే. వెంకటేష్, దయ్యాల మల్లేష్, మాణిక్యం, దానయ్య, అంజయ్య, గోపాల్ రెడ్డి, లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mar 23 2024, 16:12