బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్న, పార్టీ మారే ప్రసక్తే లేదు: మేడి ప్రియదర్శిని నకిరెకల్ నియోజకవర్గం ఇన్చార్జి
బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నా...
- ఎలాంటి ఘటనలు జరిగిన పార్టీ మారే ప్రసక్తే లేదు...
- బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ...
- నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని
ఎవరెన్ని ఆశలు పెట్టిన తలోగ్గేది లేదని, బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నానని నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బహుజన వాదం అని చెప్పి, నమ్ముకున్న కార్యకర్తలను నట్టింట ముంచి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారని అన్నారు. శుక్రవారం నాడు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీలలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఎవరు అదైర్య పడొద్దని, అందరికీ వెన్నంటుగా ఉండి, అండగా ఉంటానని బీఎస్పీ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి మేడి ప్రియదర్శిని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నరసింహ యాదవ్,నియోజకవర్గ చేరికల కమిటీ కన్వీనర్స్ మునుగోటి సత్తయ్య, చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మండలం అధ్యక్షులు జోగు శేఖర్, రామన్నపేట మండల ఉపాధ్యక్షులుగుని రాజు,ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ, మండల కోశాధికారి గట్టు రమేష్,మండల మహిళా కన్వీనర్,బందెల అనిత, నాయకులు బాలాగోని మల్లయ్య గౌడ్,బుస్సు శ్రీకాంత్,రవి,యోగి, రామ్ కుమార్ బిఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![]()








యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయాల్లో విలువలు బ్రష్టు పడుతున్న కాలంలో వాటిని కాపాడడానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం పై ఓటు వేసి ప్రజలు గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విజ్ఞప్తి చేశారు. గురువారం భువనగిరి లో సుందరయ్య భవన్లో సిపిఎం అభ్యర్థి ఎండి జాంగిర్ తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర కమిటీ ఇలా నిర్ణయం మేరకు భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుందని అన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆలేరు ,మునుగోడు ,తుంగతుర్తి నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రాలని అన్నారు .గతంలో నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు ,భువనగిరి ఇబ్రహీంపట్నంలో కమ్యూనిస్టులు గెలిచారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంటులో గత అభ్యర్థులు ప్రస్తావించక పోయారన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే ప్రస్తావిస్తారని తెలిపారు.
మిగతా రాజకీయ ప్రక్షాలు చేసే రాజకీయ జిమ్మిక్కులను ప్రజలు గందరగోళం పడకుండా ఎంతో చైతన్యవంతంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న కమ్యూనిస్టులను సిపిఎం ను గెలిపించాలని కోరారు . ఎండి జహంగీర్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన వారిని, గత 35 సంవత్సరాలుగా సిపిఎం సభ్యత్వం తీసుకొని 32 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులకు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు దోనూరు నర్సిరెడ్డి కల్లూరు మల్లేశం దాసరి పాండు మంగ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.



Mar 23 2024, 12:14
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.2k