గోపి ఆశయ సాధన కోసం మతోన్మాదం పై పోరాటం, సిఏఏ వెనుక కొట్టాలి: మాటూరు బాలరాజు, దోనూరు నర్సిరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
అమరజీవి కామ్రేడ్ తీరందాసు గోపి చిన్నతనం నుండి విద్యార్థి ఉద్యమంలో యువజన ఉద్యమంలో కీలకపాత్ర పోషించి సిపిఎం పార్టీ నిర్మాణంలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా కార్మిక సంఘం నేతగా అనేక ఉద్యమాలు నిర్వహించి పార్టీ క్యాడర్ ను ఉద్యమాల వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారని వారి ఆశయ సాధన కోసం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాదంపై పోరాటం సాగించి బిజెపిని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, దోనూరు నర్సిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక కందాల రంగారెడ్డి స్మారక భవనంలో తిరందాసు గోపి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన స్టడీ సర్కిల్ లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ
పదేండ్ల కాలంలో అధికారంలో ఉన్న బిజెపి మతోన్మాదం ముసుగులో సిఏఏ ను తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందని సిఏఏ వల్ల దేశానికి జరిగే ప్రయోజనం ఏమీ లేదని సెక్యులర్ దేశంగా ఉన్న భారతదేశాన్ని మతాల పేరుతో కులాల పేరుతో విడదీయాలని కుట్ర బిజెపి చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని బిజెపి భారతదేశాన్ని హిందుత్వ దేశంగా మార్చాలని చూస్తుందని దీనిని వామపక్షవాదులు అభ్యుదయవాదులు మేధావులు విద్యార్థి యువజనులు వ్యతిరేకించాలని సిఏఏకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ప్రత్యక్షంగా నడపాలని వారు పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ప్రజా ఉద్యమాలను బలపరచాలని ప్రజల తరఫున పోరాడే సిపిఎం ను పార్లమెంటుకు పంపాలని వారు కోరారు. వీరితోపాటు మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా,గడ్డం వెంకట్, స్టడీ సర్కిల్ బాధ్యులు అవ్వరు గోవర్ధన్, తడక మోహన్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బొజ్జ బాలయ్య, రాగిర్ కిష్టయ్య, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Mar 21 2024, 12:26