జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని పరిరక్షించాలి:BKMU
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని ఎమ్మెస్సార్ ఫంక్షన్ హాల్ లో ఉప్పల ముత్యాలు అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య మాట్లాడుతూ
నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కలకొండ కాంతయ్య కోరారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశంలో మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని, కూలీలకు నీడ కోసం టెంట్లు వేయాలని, వాటర్ సౌకర్యం కల్పించాలని కోరారు. పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటు రాష్ట్రంలో ఉన్న మిగులు భూములను భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాలను త్వరగా పూర్తిచేయాలని, పార్టీ నాయకులు కార్యకర్తలు అందుబాటులో ఉండి వారు చూపే సమస్యలకు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరారు. పార్టీ నాయకత్వము బాధ్యతతో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వీరస్వామి, సహాయ కార్యదర్శి జెట్ట రాములు, సిపిఐ మండల కార్యదర్శి జల్ది రాములు, ప్రజానాట్యమండ జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భారతమ్మ, సిపిఐ మండల నాయకులు మారుపాక వెంకటేశం, సోలిపురం లింగారెడ్డి, జక్క దయాకర్ రెడ్డి, సుల్తాన్ పురుషోత్తం, గుర్రం రాజమణి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, ఎం డి నయీమ్ తదితరులు పాల్గొన్నారు.
Mar 20 2024, 17:55