/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz పేద ప్రజల ఆశలను తుంగలోకి తొక్కిన ఆర్.ఎస్.పి: వంగాల నవీన్ బీఎస్పీ అధ్యక్షుడు Vijay.S
పేద ప్రజల ఆశలను తుంగలోకి తొక్కిన ఆర్.ఎస్.పి: వంగాల నవీన్ బీఎస్పీ అధ్యక్షుడు


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామ శాఖ బిఎస్పి అధ్యక్షుడు వంగాల నవీన్ మాట్లాడుతూ...

మోసగాడు ,నయవంచకుడు ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ దొంగ దొంగ అంటూ దొంగ పక్కనే చేరిన 420 బహుజన వర్గాలకు అన్యాయం చేస్తే కాల్చుకొని చస్తానని చెప్పి పేద ప్రజల ఆశలను తుంగలోకి తొక్కి బీఎస్పీ అధినేత్రి పై బిజెపి నాయకుల ఒత్తిడి అంటూ తప్పుడు ప్రకటన చేస్తూ BSP పార్టీని కనుమరుగు చేయాలని చూస్తే ఊరుకోము మీలాంటి దొంగ నాయకులు ఎన్ని చెసిన మా రక్త మాంసాలు మరిగించైన సరే బీఎస్పీ పార్టీని బలోపేతం చేస్తాం నువ్వు 90శాతం బహుజనులను మోసం చేసి పోయినావు నిను నాగర్ కర్నూల్ లో బహుజనులు బొంద పెట్టడం ఖాయం

 బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ శాఖ జనంపల్లి*

భువనగిరి పట్టణంలో టాక్స్ చెల్లించడం లేదని ఓ బార్ ని సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మున్సిపల్ టాక్స్ చెల్లించడం లేదని పలు కమర్షియల్ దుకాణాలను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. భువనగిరి పట్టణంలోని అవినాష్ బార్ కు సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్ టాక్స్ సంవత్సరం పైగా పెండింగ్ లో ఉందని పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ చెల్లించలేదన్నారు. దీంతో మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో సీజ్ చేయడానికి వచ్చిన అధికారులకు బార్ యాజమాన్యానికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

దుప్పల్లి లో భగత్ సింగ్, రాజ్ గురు , సుఖదేవ్ ల 93వ వర్ధంతి కరపత్రం ఆవిష్కరణ - AIYF


 అఖిల భారత యువజన సమాఖ్య AIYF ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93 వ వర్ధంతి సందర్భం మండలంలోని దుప్పల్లి గ్రామంలో, AIYF స్తూపం వద్ద ప్రచార కరపత్రం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ మాట్లాడుతూభగత్ సింగ్,రాజ్ గురు, సుకుదేవ్ ల వర్ధంతి సందర్భంగా వలిగొండ మండల -AIYF, అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 23 వ తేదీ నుండి ప్రారంభం వలిగొండ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ . ఆరూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతున్నది యువతను ప్రోత్సహించేందుకు వారిలో ఉన్న క్రీడ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఏఐవైఎఫ్ వలిగొండ మండలంలోని మండల స్థాయి క్రికెట్ పోటీలను ఏర్పాటు చేస్తున్నదని క్రీడాకారులను ఆహ్వానిస్తున్నాము అని అన్నారు. భగత్ సింగ్ జీవితం భారత దేశ యువతకు స్ఫూర్తిదాయకమని, అటువంటి మహనీయుని త్యాగాలను నేటి సమాజానికి తెలపాల్సిన భాద్యత పాలకులదేనని వారు ఉద్ఘాటించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతిని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. 75సంవత్సరాలు గడిచినా ప్రజలకు పూర్తి స్థాయి మౌలిక వసతులు ఎందుకు కేటాయించలేకపోతున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దేశ అభివృద్ధి అంటే మతాల మధ్య చిచ్చుపెట్టడమేనా అని వారు మోడీని ప్రశ్నించారు. దేశ ప్రధాని ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ వనరులను యథేచ్ఛగా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. అందుకే మోసాల మోడీని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంలొనే భగత్ సింగ్ దేశానికి బ్రిటిష్ ముష్కరులతో పోరాడి స్వాతంత్య్రం తీసుకువస్తే, మోడీ ప్రజలను మోసం చేయడంలో, ప్రజల మధ్య చీలికలు తేవడంలో సిద్ధహస్తుడయ్యాడని వారు ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.డి నయీమ్, ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు ఎర్ర కిరణ్, సుద్దాల సాయికుమార్, ఏఐవైఎఫ్ మండల సమితి సభ్యులు మేడి దేవేందర్, మెట్టు లక్ష్మీనారాయణ, మామిడికాయల నరేష్, బాలగోని రాజు,మారోజు నరసిమాచారి, అంతటి రాము, రాపోల్ పవన్, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి నరిగే యాదయ్య, తదితరులు పాల్గొన్నారు

రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: ఏఐఎస్ఎఫ్


రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగ

రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతి కుమార్ అన్నారు అలాగే పరీక్ష కేంద్రాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సెంటర్లలో కరెంటు సౌకర్యాలు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు అదేవిధంగా విద్యార్థులు నీరసంకు గురయ్యే అవకాశం ఉన్నందున విద్యార్థులకు ప్రథమ చికిత్స నిమిత్తం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎం టెంటు మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆరోగ్యశాఖ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారన్నారు అదేవిధంగా ర్యాంకుల కోసం కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్డుదారులు దొరికే అవకాశం ఉందని  అటువంటి వాటికి విద్యాశాఖ అధికారులు అడ్డుకట్ట వేయాలని అలా జరిగిన నేపథ్యంలో ఆ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థులు మనో ధైర్యం తో పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత తీసుకురావాలని కోరారు

      

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ప్రీతం కు శుభాకాంక్షలు తెలిపిన ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్


తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నాగరిగారి ప్రీతం ను వారి నివాసంలో శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్ ఎస్ యూ ఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కనుకుంట్ల బాబురావు ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుంట్ల కొండల్ ,యూత్ కాంగ్రెస్ కార్యదర్శి బాలస్వామి ,పొట్ట శరత్ రాజు పేతురు పాల్గొన్నారు.

బద్దం యాదమ్మ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : కొడారి వెంకటేష్, వయోవృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్


 

 వయోవృద్ధురాలు అని చూడకుండా భూమి పట్టా కోసం, మానసికంగా శారీరకంగా హింసించి, బద్దం యాదమ్మ మృతికి కారణమైన కోడలు, కొడుకు, మనవడి పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా "వయోవృద్ధుల సంక్షేమ సంఘం" కన్వీనర్ కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వలిగొండ మండలం (ఎం) తుర్కపల్లి గ్రామానికి చెందిన బద్దం యాదమ్మ (80), నలుబై ఏళ్ళ క్రితమే భర్తను కోల్పోయి, ఎన్నో కష్టాలు పడి ఇద్దరు కుమారులను, ఒక కుమార్తెను పెంచి పెద్ద చేసి, వారికి పెళ్ళిళ్ళు చేసి ప్రయోజకులను చేసింది. తనకున్న భూమిని కొంతభాగం పెద్ద కుమారునికి, కొంతభాగం చిన్న కుమారునికి పట్టా చేసింది. కొంత భూమిని తన పేరుమీద ఉంచుకుంది. తన తదనంతరం ఆమె ఇద్దరు కుమారులకు చెందే విధంగా చేయాలని ఆమె కోరింది. కానీ ఇది నచ్చని ఆమె పెద్ద కొడుకు, కోడలు, మనవడు ఆమె పేరు మీదున్న సుమారు మూడు ఎకరాల భూమిని తమకు పట్టా చేయాలని యాదమ్మను, గత కొంత కాలంగా వేధిస్తున్నారు. నేను చనిపోయే వరకూ ఆ భూమి నాపేరు మీదనే ఉంటుందని యాదమ్మ చెప్ఫడంతో , కొడుకు, కోడలు, మనవడు విచక్షణ కోల్పోయి గత ఆదివారం రోజున యాదమ్మ ను చేతులతో, కర్రలతో విపరీతంగా కొట్టి గాయపరిచారు. తల్లికి గాయాలైన విషయం తెలుసుకున్న మోత్కూరు లో ఉంటున్న కుమార్తె కొంతం సువర్ణ, తుర్కపల్లి కి వచ్చి, పరిస్థితి తెలుసుకొని వలిగొండ పోలీసులకు పిర్యాదు చేసి యాదమ్మను చికిత్స కోసం మోత్కూరు కు తీసుకెళ్ళింది. ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తుండగా శుక్రవారం యాదమ్మ కు కడుపులో విపరీతంగా నొప్పి రావడం తో డాక్టరు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్ళాలని సూచించగా మార్గమధ్యంలో యాదమ్మ మృతి చెందారు

. వలిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదమ్మ పేరునగల భూమిని తన పేరుమీద రిజిష్టర్ చేయాలని, మానసికంగా, శారీరకంగా హింసించిన కొడుకు సాయిరెడ్డి, కోడలు స్వరూప, మనవడు రాంరెడ్డి ల పై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయాలని, పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేసే అవకాశం ఉన్నందున సెక్షన్ 201 కింద కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ -2007 ప్రకారం బద్దం యాదమ్మ కు న్యాయం జరగాలని, బద్దం యాదమ్మ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి కి పిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని , అధికారులను, పోలిస్ లను ఆయన కోరారు.

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కేంద్రం లోనికి గ్రేస్ టైం 15 నిమిషాలు ఇవ్వాలి: దుబ్బ రామకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు


యాదాద్రి భువనగిరి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ మాట్లాడుతూ రేపటి నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోనికి ఒక్క నిమిషం ఆలస్యమైనచో అనుమతి నిరాకరణ నిబంధన నుండి ఐదు నిమిషాలకు బదులుగా 15 నిమిషాలు ఇవ్వాలని అన్నారు పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు దాదాపు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అధికంగా ఉన్నారు. వారంతా ఆయ ప్రాంతాల నుండి సరైన రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందు పడాల్సిన పరిస్థితి నెలకొంది కావున ఈ 15 నిమిషాల వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

వలిగొండ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అభివృద్ధి పనులు జెడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి జడ్పిటిసి నిధులు అరుర్ గ్రామము నుండి చంద్రాయన గుట్టకు వెళ్లే కల్వర్టు కు 3,50,000కేటాయించినారు. వెలివేర్తి లో సిసి రోడ్డు కోసం 250000 జెడ్పిటిసి నిధుల నుండి కేటాయించి న్నారు. వేములకొండ దగ్గర కల్వర్టు కు నాలుగు లక్షల రూపాయలు.

 జడ్పిటిసి నిధుల నుండి కేటాయించి ఈరోజు  గ్రామ పెద్దలు సమక్షంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెల్వర్తి ఎంపీటీసీ ఎడవెల్లి యాదగిరి వేములకొండ ఎంపిటిసి సామ రామిరెడ్డి. మండల నాయకులు రసూలు పులిపాలుపుల రాములు. అరూరు గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు పరమేష్ నరసింహ . కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ ...తుర్కపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన బద్దం యాదమ్మ భర్త నర్సిరెడ్డి నీ తన పెద్ద కోడలు బద్దం స్వరూప మరియు ఆమె కుమారుడు బద్దం సాయి రెడ్డి వ్యవసాయ భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేయాలని తరచూ కర్రలతో కొట్టడంతో బద్దం యాదమ్మ తేదీ 12 -03- 24 న కోడలు స్వరూప పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. మోత్కూర్ లో ఉంటున్న తన పెద్ద కూతురు కొంతం సువర్ణ దగ్గర ఉండగా శుక్రవారం రాత్రి 10:30 నిమిషాలకు కడుపు, ఛాతిలో నుండి నొప్పి రావడంతో మోత్కూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యాదమ్మ మృతి చెందారు. మృతురాలి కుమారుడు బద్దం మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని శనివారం వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

బొమ్మలరామరంలో కల్నాన్ వినయ్ భాను రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


భారతదేశంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కల్నల్ వినయ్ బాను రెడ్డి విగ్రహాన్ని బొమ్మల రామారం నడి బొడ్డున చౌరస్తాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషమని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. కల్నల్ వినయ్ బాను రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా శనివారం వినయ్ బాను రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ..వారు ప్రాణత్యాగం చేసింది వారి కుటుంబం కోసమో ఇంకెవరి కోసమో కాదు భారతదేశ స్వాతంత్రం కోసం మన అందరి గుండెల్లో ఉండే వ్యక్తి మనం ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి కల్నల్ వినయ్ భాను రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం ఇచ్చిన ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయడానికి మీ వంతు కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.కల్నల్ వినయ్ బాను రెడ్డికి ప్రత్యేకంగా నివాళులర్పించారు..వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.